నయన్ నేత్రికన్ ఓటిటి లో

Wed 21st Jul 2021 01:56 PM
nayanthara,netrikann movie,netrikann to stream on disney plus hotstar,netrikann release date soon,nayanthara netrikann movie,  నయన్ నేత్రికన్ ఓటిటి లో
Nayanthara Netrikann to stream on Disney Plus Hotstar నయన్ నేత్రికన్ ఓటిటి లో

తమిళనాడులో ఇంకా పాక్షిక లాక్ డౌన్ నడుస్తుంది. కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కంట్రోల్ కి రావడంతో స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో ఆంక్షలతో కూడిన పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తుంది. జులై 31 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో అక్కడ థియేటర్స్ విషయంలోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దానితో కొన్ని సినిమాలు ఓటిటి బాట పట్టాయి. అందులో రేపు అమెజాన్ ప్రైమ్ నుండి ఆర్య నటించిన సారాపట్టు రిలీజ్ అవుతుంది. ఇక నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిలిం నేత్రికన్ కూడా ఇప్పుడు ఓటిటి బాట పట్టింది. 

ఏంతో క్రేజ్ ఉన్న నయనతార సినిమాలు గత  ఏడాది లాక్ డౌన్ లోనే ఓటిటి రిలీజ్ లు అయ్యాయి. తాజాగా నయనతార నటించిన నేత్రికన్ ని ఓటిటిలో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. నయనతార నేత్రికన్ మూవీ ని డిస్నీ + హాట్ స్టార్ లో రిలీజ్ చెయ్యబోతున్నారు. నేత్రికన్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో నయన్ అంధురాలిగా నటిస్తుంది. అయితే జస్ట్ ఓటిటి రిలీజ్ అంటూ కన్ ఫర్మ్ చేసారు కానీ.. ఇంకా రిలీజ్ డేట్ ని ప్రకటించ లేదు.. త్వరలోనే రీలీజ్ డేట్ అనౌన్సమెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. 

Nayanthara Netrikann to stream on Disney Plus Hotstar:

Nayanthara Netrikann to stream on Disney Plus Hotstar: release date soon