శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

Tue 20th Jul 2021 10:40 AM
shilpa shetty,husband raj kundra,raj kundra,raj kundra arrested,pornography case  శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్
Shilpa Shetty husband Raj Kundra lands in trouble శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్

పలుకుబడి ,పరపతి ఉన్న శిల్ప శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా తరచూ ఏదో ఒక విషయం లో న్యూస్ గా  మారుతూనే ఉన్నారు. ఈమధ్యనే శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా తన మొదటి  భార్య కవిత  ప్రవర్తన నచ్చకే ఆమెకి విడాకులు ఇచ్చి 2009 లో శిల్ప శెట్టి ని వివాహమాడినట్లుగా చెప్పుకొచ్చాడు. శిల్ప శెట్టి - రాజ్ కుంద్రాలకు ముంబై లో పలు బిజినెస్ లు ఉన్నాయి. ఇద్దరూ జంటగా ఐపీఎల్ ప్రాంచైస్ గా కూడా ఉన్నారు. అయితే తాజాగా శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రాని ముంబై పోలీస్ లు అరెస్ట్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలు తయారు చేయించి.. యాప్స్‌లో అప్ లోడ్ చేయించి డబ్బులు సంపాదిస్తున్నట్లుగా.. గత ఫిబ్రవరిలో ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు. 

ఈ కేసు విషయంగానే ముంబై లో ఓ నటిని కూడా అరెస్ట్ చేశారు. ఆ నటి దగ్గర పోలీస్ లు తీగ లాగితే.. ఈ కేసు శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా కి చుట్టుకుంది. అయితే రాజ్ కుంద్రా మెయిన్ గా సాంకేతిక ఆధారాలు మొత్తం సేకరించిన పోలీసులు … తాజాగా రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ రాజ్ కుంద్రాని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తితో బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 

Shilpa Shetty husband Raj Kundra lands in trouble:

Shilpa Shetty husband arrested in Pornography