జాతి రత్నానికి తమిళ రత్నం దొరికిందా

Mon 12th Jul 2021 10:29 PM
jathi ratnalu,jathi ratnalu director anudeep,kollywood hero,tamil hero sivakarthikeyan,sivakarthikeyan  జాతి రత్నానికి తమిళ రత్నం దొరికిందా
Jathi Ratnalu Director Anudeep next movie with Tamil Hero జాతి రత్నానికి తమిళ రత్నం దొరికిందా

ఈ ఏడాది చాలా సింపుల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా మార్చ్ లో రిలీజ్ అయిన జాతిరత్నాలు మూవీ అద్భుతమైన కామెడీ హిట్ అవడమే కాదు.. ఆ సినిమాని నిర్మించిన వైజయంతి మూవీస్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిన్న సినిమాగా జాతి రత్నాలు నిలిచింది. జాతిరత్నాలుగా నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కలిసి చేసిన కామెడీ, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అనుదీప్ మేకింగ్ స్టయిల్ కి ఫుల్ మర్క్స్ పడినాయి. జాతి రత్నాలు సక్సెస్ తర్వాత అనుదీప్ నాగ్ అశ్విన్ బ్యానర్ లో పెద్ద హీరోతో సినిమా చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. 

జాతిరత్నాలు ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ మూవీ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉండబోతుంది అని చెప్పి మరింత ఆసక్తి క్రియేట్ చేసాడు అనుదీప్. అయితే తాజాగా అనుదీప్ తన నెక్స్ట్ మూవీ కోసం కోలీవుడ్ హీరోతో మంతనాలు జరుపుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. తమిళ్ హీరో శివకార్తికేయన్ తో అనుదీప్ నెక్స్ట్ మూవీ ఉండొచ్చనే ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శివ కార్తికేయన్ తో అనుదీప్ తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో ఓ సినిమా చెయ్యాలని చూస్తున్నాడట. అయితే అనుదీప్ తెలుగు స్టార్స్ ని వదిలి కోలీవుడ్ హీరోని సంప్రదించడం వెనుక నాగ్ అశ్విన్ సలహా ఉందనే న్యూస్ మాత్రం హైలెట్ అవుతుంది. 

Jathi Ratnalu Director Anudeep next movie with Tamil Hero:

Jathi Ratnalu director Anudeep to team up with Sivakarthikeyan