అలా వైకుంఠపురములో సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ రేంజ్ మాములుగా పెరగలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ మొదలు పెడతారనుకుంటే.. ఎన్టీఆర్ తో మాములుగా సినిమా అనౌన్స్ చేసేసాడు. కానీ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ ఆగిపోయింది, ఆ తర్వాత ఎన్టీఆర్30 కి కొరటాల సెట్ అవ్వగా.. త్రివిక్రమ్ మహేష్ SSMB28 కి షిఫ్ట్ అయ్యారు. త్రివిక్రమ్ - మహేష్ కాంబో మూవీ బ్యాగ్డ్రాప్ పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. అయితే త్రివిక్రమ్ ఎప్పటిలాగే తన రిచ్ సెటప్ నే ఫాలో అవుతారని తెలుస్తుంది. అంటే హీరో రిచ్ గా, డబ్బు చుట్టూనే కథ తిరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట.
త్రివిక్రమ్ సినిమాలన్నీ రిచ్ గాను, డబ్బు చుట్టూ తిరిగేవిగాను ఉంటాయి. అంటే హీరో కి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక, అన్ని రిచ్ గా ప్లాన్ చేసుకున్నట్లుగానే మహేష్ ని మరోసారి రిచ్ గా చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ కథే మహేష్ కి వాడుతున్నాడని కొందరంటున్నా.. మహేష్ మూవీ విషయంలో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకుంటున్నాడట త్రివిక్రమ్. అతడు లో మహేష్ ని కాస్త సీరియస్ గా చూపిస్తే.. ఖలేజాలో ఆయనలోని కామెడిని ప్రేక్షకులకి చూపించారు త్రివిక్రమ్.. మరి ఈసారి మహేష్ రోల్ ఎలా డిజైన్ చేసాడో త్రివిక్రమ్ అంటూ మహేష్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.