మ్యాస్ట్రో డీల్ పూర్తయ్యిందా

Fri 25th Jun 2021 02:53 PM
nithin,maestro movie,nithin maestro movie,nabha natesh - nithin combo,tamanna,nithin next movie,hot star ott,hotstar  మ్యాస్ట్రో డీల్ పూర్తయ్యిందా
Nithin Maestro to be released in OTT మ్యాస్ట్రో డీల్ పూర్తయ్యిందా

ఈ ఏడాది చెక్ మూవీ తో పాటుగా రంగ్ దే అంటూ కలర్ ఫుల్ హిట్ కొట్టిన నితిన్.. మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ చేసేసాడు. బాలీవుడ్ హిట్ మూవీ అంధధూన్ ని తెలుగులో మ్యాస్ట్రో కింద రీమేక్ చేసాడు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే తక్కువ బడ్జెట్ తో  తెరకెక్కిన ఈ సినిమాని ఓటిటికి అమేసినట్లుగా తెలుస్తుంది. హీరో నితిన్ కూడా మేకర్స్ కి లాస్ రాకుండా ఓటిటి డీల్ కి ఒప్పుకున్నాడని, ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకుల స్పందన తెలియదు. 

ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయితే ఓకె లేదంటే నిర్మాతలకి లాస్. అందుకే ఓటిటికి అమ్మేస్తే.. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. గంపగుత్తగా రైట్స్ కొనేసి.. డబ్బు చెల్లిస్తారు. అందుకే నిర్మాతలకి నష్టం కలగకుండా, థియేటర్స్ లోనే సినిమా రిలీజ్ అవ్వాలని భీష్మించుకుని కూర్చోకుండా నితిన్ మ్యాస్ట్రో ని ఓటిటికి అమ్మెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. మ్యాస్ట్రో మూవీని హాట్ స్టార్ ఓటిటి చేజిక్కించుకున్నట్లుగా సమాచారం. పెట్టిన పెట్టుబడితో పాటుగా, టేబుల్ ప్రాఫిట్ ఈ మూవీకి మేకర్స్ అందుకున్నారని అంటున్నారు. 

Nithin Maestro to be released in OTT:

 Maestro to be released in Hotstar