Advertisement

బిగ్ బాస్ మళ్ళీ అప్పుడేనట

Tue 15th Jun 2021 08:49 PM
bigg boss 5,bigg boss season 5,nagarjuna,bigg boss telugu  బిగ్ బాస్ మళ్ళీ అప్పుడేనట
Bigg boss 5 Telugu from September? బిగ్ బాస్ మళ్ళీ అప్పుడేనట
Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 జులై నుండి మొదలు కాబోతుంది.. ఇప్పటి నుండే బిగ్ బాస్ కొసం ఓ 30 మంది ని జూమ్ మీటింగ్ లో ఇంటర్వూస్ చేసి 15 మందిని సెలెక్ట్ చేసి జులై చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారని న్యూస్ నడుస్తుంది. సెలెక్ట్ చేసిన 15 మందిని ఓ 14 రోజులు క్వారంటైన్ లో ఉంచి.. ఆ తర్వాత హౌస్ లోకి పంపిస్తారని.. దీనికి నాగార్జునే హోస్ట్ గా రాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సీజన్ కోసం లిస్ట్ కూడా సిద్దమైంది అని.. అందులో యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఏవేవో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే కొన్ని కారణాల వలన బిగ్ బాస్ సీజన్ 5 అనుకున్నట్టుగా జులై నుండి మొదలు కావడం లేదట. అంటే గత ఏడాదిలానే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండే మొదలు కాబోతుంది అని.. అప్పటికి సెలబ్రిటీస్ ని సిద్ధం చేసి స్టార్ మా గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 5 ని మొదలు పెట్టబోతోంది అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ షో ఈసారి అల్లాటప్పాగా అంటే లీకుల బెడదా లేకుండా.. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సీజన్ వన్ ఎలా ఉన్నా.. 2 అండ్ 3 అండ్ 4 లు లీకుల తో కాస్త గజిబిజి అయ్యింది.. ఇక ఈ సీజన్ కి అలాంటి బెడద లేకుండా చూస్తున్నారట.

Bigg boss 5 Telugu from September?:

Bigg boss 5 telugu update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement