సమంత సారి చెప్పాల్సిందే

Wed 09th Jun 2021 06:03 PM
kollywood actor manobala,manobala demands,samantha apologize,samantha akkineni,family man 2  సమంత సారి చెప్పాల్సిందే
Shocking comments by senior actor ManoBala on Samantha సమంత సారి చెప్పాల్సిందే
Advertisement
Ads by CJ

ఫ్యామిలీ మ్యాన్ వివాదం ఇప్పుడు మరింతగా రాజుకుంది. నిన్నమొన్నటివరకు తమిళ ప్రేక్షకులే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ని ఆపెయ్యాలనంటూ నినాదాలు చేసారు. సోషల్ మీడియాలో #ShameOnSamantha  #Familyman2againstTamils హాష్ టాగ్స్ తో వరస ట్వీట్స్ చేసారు. ఫ్యామిలీ మాన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ ని ఆపేయ్యాలంటాయి నానా యాగీ చేస్తున్నారు. #BoycottAmazon అంటూ అమెజాన్ ప్రైమ్ మీద కుడా పడ్డారు. ఫ్యామిలీ మ్యాన్ లో సమంత రాజి పాత్రలో LLTE తీవ్రవాదిగా రెబల్ గా ISI తో కలిసి ఇండియా మీదే తిరుగుబాటు చెయ్యడం తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజాగా తమిళ్ సెలబ్రిటీస్ ఫ్యామిలీ మ్యాన్ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. కోలీవుడ్ సెలబ్రిటీస్ భారతి రాజా లాంటి వాళ్ళు ఫ్యామిలీ మాన్ మేకర్స్ పై నిప్పులు చేరగడమే కాదు.. నటుడు మనోబాల ఈ వివాదంపై ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు కామెంట్లు చేశారు. ద ఫ్యామిలీ మ్యాన్ 2 తమిళుల మనోభావాలను దెబ్బతీసేదిలా ఉంది అని, ఇలాంటి వెబ్ సిరీస్‌లో నటించినందుకు సమంత అక్కినేని తప్పకుండా క్షమాపణలు చెప్పితీరాలి. రాజీ పాత్ర విషయంలో కూడా చిత్రబృందం సామంత ని మోసం చేసింది. అసలు తమిళ చరిత్ర తెలుసుకోకుండా సమంత ఈ కేరెక్టర్ ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. 

దీనికి బాధ్యత వహిస్తూ సమంత క్షమాపణలు చెప్పినా సరే.. లేదు వెబ్ సీరీస్ బృందం పూర్తి బాధ్యత తీసుకునే వరకూ సిరీస్‌కు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం అంటూ ఆయన ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Shocking comments by senior actor ManoBala on Samantha:

ManoBala demands Samantha apologize

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ