బన్నీ కోసం థాంక్యూ దర్శకుడి గాలం
స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలనే ఆరాటం చాలామంది డైరెక్టర్స్ కి ఉన్నా.. ఆ అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్, త్రివిక్రమ్, పూరి లాంటి దర్శకుల హవా నడుస్తుంది. ఈ డైరెక్టర్స్ కి మాత్రం స్టార్ హీరోల డేట్స్ దొరుకుతున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు విక్రమ్ కుమార్ ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడు. 13B, 24, మనం సినిమాలతో సక్సెస్ సాధించిన విక్రమ్ కుమార్ కి అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు చాలా పాట్లు పడుతున్నాడు. విక్రమ్ కి వరస ప్లాప్స్ ఉండడంతో అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ కి సందు ఇవ్వడం లేదు.
ఆయన దర్శకత్వంలో వచ్చిన హలొ, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు నిరాశపరచడంతో అల్లు అర్జున్ కూడా వెనకడుగు వేసాడు. ఇప్పుడు విక్రమ్ కుమార్ నాగ చైతన్య తో చేస్తున్న థాంక్యూ మూవీ హిట్ అయితే గనక అల్లు అర్జున్ ఎమన్నా విక్రమ్ కుమార్ కి ఛాన్స్ ఇస్తాడేమో కానీ.. ప్రస్తుతం బన్నీకి ఆయనతో చేసే ఉద్దేశ్యం లేదు. కానీ విక్రమ్ కుమార్ మాత్రం బన్నీతో నా డ్రీం ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా అంటున్నాడు. మరి విక్రమ్ కుమార్ డ్రీం ప్రాజెక్ట్ ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూద్దాం. థాంక్యూ హిట్ మీదే ఆయన కలల ప్రాజెక్ట్ ఆధారపడి ఉంటుంది.