ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Disappointment ahead for Mahesh Babu fans

సంబరాలు మిస్ అయిన సూపర్ స్టార్ ఫాన్స్

ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు. మహేష్ బాబు తండ్రి పుట్టిన రోజునాడు నాన్నకి ప్రేమతో బర్త్ డే విషెస్ చెప్పడమే కాదు.. తన సినిమాలకు సంబందించిన లుక్స్ ని కానీ, లేదంటే తన కొత్త సినిమాలకు సంబందించిన పూజా కార్యక్రమాలను కానీ చెయ్యడం మహేష్ బాబుకి గత కొన్నేళ్లుగా సెంటిమెంట్ గ వస్తున్న వ్యవహారం. దానితో మహేష్ ఫాన్స్ కి ఉత్సాహం, ఉల్లసంగా కృష్ణ గారు బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకునేవారు. మామూలుగానే కృష్ణ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మహేష్ కూడా సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతూ అభిమాన గణాన్ని పెంచుకున్నాడు.

అయితే ఎప్పుడూ కృష్ణ గారి పుట్టిన రోజు మహేష్ మూవీ సర్ప్రైజ్ లతో హడావిడి చేసే ఫాన్స్.. కేవలం సూపర్ స్టార్ కృష్ణ కి బర్త్ డే విషెస్ చెప్పి ఊరుకోవాల్సి వస్తుంది. నాలుగు రోజుల క్రితమే మహేష్ పిఆర్ టీం ఈ కరోనా పరిస్థితుల్లో  మహేష్ బాబు మూవీస్ నుండి ఎలాంటి సర్ప్రైజెస్ ఉండబోవని.. స్పష్టం చేసింది. దానితో మహేష్ ఫాన్స్ డిస్పాయింట్ అయినా కామ్ అయ్యారు. లేదంటే మహేష్ కొత్త మూవీ ఓపెనింగ్ కోసం, సర్కారు వారి పాట లుక్ కోసం వెయిట్ చేసి సోషల్ మీడియాని అల్లాడించేవారు. 

Major disappointment ahead for Mahesh Fans

Disappointment ahead for Mahesh Babu fans
super star krishna
mahesh babu
mahesh fans
sarkaru vaari paata movie look
ssmb28 opening ceremony
krishna birthday special