Advertisementt



నాని రిస్క్ చేస్తాడా

Sat 22nd May 2021 08:49 PM
nani,jersy movie,cricketer,bheemili kabaddi jattu,sports entertainer,rashmika  నాని రిస్క్ చేస్తాడా
Nani turning football player నాని రిస్క్ చేస్తాడా
Advertisement
Ads by CJ

నాని కి గత కొన్ని రోజులుగా హిట్ అన్నదే లేదు. అంటే కృష్ణార్జున యుద్ధం హిట్ అన్నారు కలెక్షన్స్ రాలేదు. అలాగే గ్యాంగ్ లీడర్ బావుంది అన్నారు.. డబ్బులు రాలేదు. జెర్సీ సూపర్ అన్నారు.. కాసులు గలగలా వినిపించలేదు. ఇక వి లో విలన్ అన్నారు, పర్లేదన్నారు.. కానీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన వి ప్లాప్ అయ్యింది. ఇక తాజాగా నాని టక్ జగదీశ్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.. కానీ సెకండ్ వేవ్ కరోనా. దానితో ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఇక శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి షూటింగ్స్ కూడా ఆగాయి. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని చేసిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సూపర్ డూపర్ అన్నారు.. కానీ కలెక్షన్స్ లేవు. అయితే నేషనల్ అవార్డు వచ్చింది.

అయితే జెర్సీలో క్రికెటర్ గా అద్భుతంగా నటించిన నాని ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా.. అవార్డు అందుకున్నాడు. మరోసారి ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలో నాని నటించబోతున్నాడనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో భీమిలి కబడ్డీ జట్టులో నటించిన నాని.. ఆ సినిమా హిట్ అవలేదు. తాజాగా ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ విన్నాడట నాని. ఓ కొత్త దర్శకుడు చెప్పిన ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ స్టోరీకి ఇంప్రెస్స్ అయిన నాని.. ఆ సినిమా చేయబోతున్నాడని.. ఆ సినిమాలో మరోసారి రష్మిక తో రొమాన్స్ కూడా చేయబోతున్నాడనే న్యూస్ మొదలైంది. గతంలో దేవదాసు సినిమాలో నాని - రష్మిక జంటగా నటించారు. 

అయితే నాని రెండుసార్లు స్పోర్ట్స్ డ్రామాతో బ్లాక్ బస్టర్ కొట్టలేదు కదా.. ఇప్పుడు మరోసారి రిస్క్ చేస్తాడా? అని అంటున్నారు.

Nani turning football player:

Nani eyeing other sports entertainer

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ