Advertisement

ఫ్యామిలీ మ్యాన్ పై విషం చిమ్ముతున్న తమిళులు

Wed 19th May 2021 06:37 PM
samantha akkineni,the family man 2,tamil,tamilians,samantha character,raji role,raj and dk,the family man 2 trailer,boycott_familyman2,familyman2_against_tamils,hash tags  ఫ్యామిలీ మ్యాన్ పై విషం చిమ్ముతున్న తమిళులు
Controversy hits The Family Man 2 ఫ్యామిలీ మ్యాన్ పై విషం చిమ్ముతున్న తమిళులు
Advertisement

ద మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ డేట్ మాత్రమే కాదు.. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ఈ రోజు ఉదయం 9 గంటలకి రిలీజ్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు అభిమానులు. సమంత, మనోజ్ బాజ్ పేయీ లను, దర్శకుడు రాజ్ అండ్ డీకే లను మెచ్చుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. సౌత్ ప్రముఖులు సమంత నెగెటివ్ పెరఫార్మెన్స్ ని తెగ మెచ్చేసుకుంటున్నారు. అంతలాంటి పాపులారిటీ ఉన్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పై ఇప్పుడు తమిళులు విషం చిమ్ముతున్నారు. ఆ ట్రైలర్ లో సమంత తమిళ్ లో అందరిని చంపేస్తాను అంటూ చెప్పిన డైలాగ్ అలాగే ఆమె కేరెక్టర్ చూసి తమిళ్ లు రెచ్చిపోతున్నారు.

సమంత తమిళ టెర్రరిస్ట్ గా రాజి గా నెగెటివ్ రోల్ చెయ్యడం, ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ ముంబై లో జరిగితే.. సీజన్ 2 ని చెన్నై లో తీశారు. సమంతని రాజీ అనే శ్రీలంక తమిళ తిరుగుబాటుదారురాలిగా చూపించడం తమిళియన్స్ కి నచ్చడం లేదు. అందుకే #Familyman2_Against_Tamils అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున సమంత ని టార్గెట్ చేస్తున్నారు. తమిళ సినిమాలతో పాపులారిటీ సంపాదించిన సమంత అలాంటి టెర్రరిస్ట్ రోల్ ఎలా చేస్తుంది అని, అలాగే ఈ సీరీస్ లో తమిళులని టెర్రరిస్టులుగా చూపటమే కాక తమిళనాడు వ్యక్తులకు ఐఎస్ఐతో కనెక్షన్ ఉందని చెప్పడం దారుణం అని కామెంట్ చేస్తున్నారు. #Familyman2_Against_Tamils అనే హాష్ టాగ్ తో ట్విట్టర్ ని కుదిపేసారు వారు. మరి సమంత రాజి కేరెక్టర్ లో అదిరిపోయే డీ గ్లామర్ లుక్ లో కనిపించి అదరగొట్టింది అని అంటుంటే.. ఇటు తమిళియన్స్ మాత్రం సమంత ని టార్గెట్ చేసారు.

Controversy hits The Family Man 2:

Familyman2_Against_Tamils hashtag trend in Twitter 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement