ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Makers Confirm Liger Teaser is Postponed

లైగర్ టీజర్ లేట్ కి కారణం

మే 9 విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. రౌడీ హీరో బర్త్ డే కి ఆయన ఫాన్స్ హడావిడి మాములుగా లేదు. రౌడీ స్టార్ ఫాన్స్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం లైగర్ మూవీ నుండి ఏదైనా ట్రీట్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. మే 9 న విజయ్ బర్త్ డే కి లైగర్ టీజర్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు వారు. పాన్ ఇండియా లెవల్లో పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ పై భారీ క్రేజ్ ఉంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హ్యాండ్ లో లైగర్ లో ఉండడం, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించడం, లైగర్ ఫస్ట్ లుక్ అన్ని కలిపి సినిమాపై అంచనాలు పెంచేసింది.

అయితే నేడు  విజయ్ బర్త్ డే స్పెషల్ గా లైగర్ నుండి టీజర్ ని విడుదల చేయలేకపోతున్నామని, అసలైతే లైగర్ టీజర్ తో ఫాన్స్ కి ట్రీట్ ఇద్దామనుకున్నామని, కానీ కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటి సిస్ట్యువేషన్ లో లైగర్ టీజర్ ని రిలీజ్ చేయలేమని, అందుకే టీజర్ రిలీజ్ ఆపినట్లుగా పూరి కనెక్ట్స్ నుండి మేటర్ షేర్ చేసారు. పరిస్థితులు అనుకూలించాక లైగర్ టీజర్ ని రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది లైగర్ టీం. ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ ఫాన్స్ కొంచెం డిస్పాయింట్ అయినా.. పోనిలే ఇలాంటి టైం లో సెలెబ్రేషన్స్ కూడా చేయలేము.. తర్వాత టీజర్ ఇచ్చాక చూసుకుందామని డిసైడ్ అయ్యారు. ఇక ఈ రోజు బర్త్ డే బాయ్ విజయ్ దేవరకొండ కి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Makers Confirm Vijay Deverakonda and Ananya Panday Starrer Liger Teaser is Postponed

Makers Confirm Liger Teaser is Postponed
vijay deverakonda
ananya panday
liger teaser
postponed
vijay deverakonda birthday
vijay deverakonda liger movie
liger pan india movie
vijay deverakonda bday special