Advertisementt
CJ Ads

థాంక్ యు షూట్ కంప్లీటెడ్

Fri 07th May 2021 03:22 PM
nag chaitanya,raashi khanna,avika goer,vikram k kumar,thank you movie,thank you shooting completed  థాంక్ యు షూట్ కంప్లీటెడ్
Thank You Movie Shooting completed థాంక్ యు షూట్ కంప్లీటెడ్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న థాంక్ యు మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. అయితే ఈ మధ్యన కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా థాంక్ యు మూవీ షూటింగ్ ఆగినట్లుగా వార్తలొచ్చాయి. అందులోనూ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ ఇటలీ వెళ్లలేకపోవడంతో.. థాంక్ యు మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వక తప్పలేదు అన్నారు. నాగ చైతన్య అండ్ థాంక్ యు టీం కూడా హైదరాబాద్ కి వచ్చెయ్యబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఇటలీలో థాంక్ యు సినిమా షూటింగ్ ఆగలేదు. అక్కడ హీరోయిన్స్ తో కలిసి నాగ చైతన్య థాంక్ యు షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. థాంక్ యు సెట్స్ లో రాశి ఖన్నా నాగ చైతన్యతో దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. ఆ సెల్ఫీని రాశి ఖన్నా సాంఘీక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ సెల్ఫీ చూసాక థాంక్ యు మూవీ షూటింగ్ కి బ్రేకులు పడలేదు.. కరోనా వలన షూటింగ్ ఆగలేదు అని ఫిక్స్ అవుతున్నారు ఫాన్స్. యధావిధిగా అన్ని నిభంధనలతో షూటింగ్ చేసుకున్న థాంక్ యు బృందం.. ఈ సినిమా షూటింగ్ ముగించేశారని తెలుస్తుంది. మరి ఇంత పాండమిక్ టైం లో అన్ని జాగ్రత్తలతో యూనిట్ సభ్యులెవరికి కరోనా సోకకుండా ఈ సినిమా షూటింగ్ దిగ్విజయంగా పూర్తి చేసింది థాంక్ యు టీం.

Thank You Movie Shooting completed:

Nag Chaitanya Thank You Movie Shooting completed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ