Advertisement

ఇక్కడ నో లాక్ డౌన్.. అక్కడ నో ఎంట్రీ

Fri 07th May 2021 09:37 AM
delhi,quarantine,14 days,visitors,ap,telangana,covid safety  ఇక్కడ నో లాక్ డౌన్.. అక్కడ నో ఎంట్రీ
No lockdown here, No entry there ఇక్కడ నో లాక్ డౌన్.. అక్కడ నో ఎంట్రీ
Advertisement

తెలంగాణాలో లాక్ డౌన్ పెట్టమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసారు. కరోనా నుండి పూర్తిగా కోలుకున్న కేసీఆర్ నిన్న హైదరాబాద్ కి చేరుకొని ప్రగతి భవన్ లో కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత తెలంగాణలో లాక్ డౌన్ పెట్టేది లేదంటూ తేల్చేసారు. లాక్ డౌన్ పెట్టిన రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, లాక్ డౌన్ వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అందుకే లాక్ డౌన్ పెట్టమని చెప్పారు. ఇక ప్రధాని మోడీ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లతో నిన్న ఫోన్ లో మాట్లాడారు. కరోనా పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆయన జగన్, కేసీఆర్ ని కనుకుక్కున్నారు.

ఇక రెండు తెలుగురాష్ట్రాల ప్రజలని ఢిల్లీ గవర్నమెంట్ తమ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటుంది. రెండు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్న వారికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తామని, రోడ్డు, రైలు, విమాన మార్గంలో వచ్చే ప్రతి ఒక్కరు ఈ నిభందనలు పాటించాలనంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. 

No lockdown here, No entry there:

Delhi to quarantine for 14 days visitors from AP, Telangana as Covid safety

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement