Advertisement

పుష్ప తరువాత బన్నీ ప్లాన్ మార్చాడా?

Mon 03rd May 2021 10:08 PM
allu arjun,pushpa pan india movie,allu aravind,director ar murugadoss,pan india films,koratala siva  పుష్ప తరువాత బన్నీ ప్లాన్ మార్చాడా?
AR Murugadoss to direct Allu Arjun? పుష్ప తరువాత బన్నీ ప్లాన్ మార్చాడా?
Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ లో కూడా షూటింగ్ చేయాలనీ ప్లాన్ చేసారు.. కానీ అల్లు అర్జున్ కు కరోనా సోకడంతో టీం షూటింగ్ కు బ్రేకులువేసింది. అన్ని పరిస్థితులు సర్దుకున్నాకే మళ్ళీ షూటింగ్ మొదలెట్టే ఆలోచనలో ఉన్నారు. పుష్ప సినిమా విషయంలో మొదటినుండి రకరకాల టెన్షన్స్ అడ్డుపడుతూనె ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ పుష్ప సినిమా తరువాత చేసే తదుపరి సినిమా విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నాడట? దానికి కారణం ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ప్లాన్ చేసారు.. కానీ అది ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా లేదు.

ఆ తరువాత కొరటాల శివతో కూడా సినిమా అన్నారు.. కానీ అది కూడా పక్కకు పెట్టేసి.. కొత్త దర్శకుడిని ట్రాకులోకి తెచ్చేప్లాన్ చేస్తున్నాడు అల్లు అరవింద్. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ తో చేయించే సన్నాహాలు మొదలెట్టారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాకోసం ఇప్పటికే మురుగదాస్ కూడా కథ చర్చలో ఉన్నాడట. నిజానికి ఓ వైపు ఐకాన్ అంటూ వేణు శ్రీరామ్, కొరటాల శివ ఇలా పలువురు దర్శకులు లైన్ లో ఉండగా ఇవన్నీ కాదని మురుగదాస్ ని లైన్ లోకి తేవడానికి ముఖ్య కారణం.. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టే ఆలోచనలో భాగంగా ఇది వర్కవుట్ చేస్తున్నారట.

పుష్ప ఎలాగూ పాన్ ఇండియా సినిమానే.. ఆ తరువాత మురుగదాస్ సినిమాకూడా అదే స్థాయిలో ఉంటుంది. పైగా మురుగదాస్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరు కాబట్టి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకోసం ఇదే రంగం సిద్ధం చేస్తున్నారు.

AR Murugadoss to direct Allu Arjun?:

Allu Arjun to team up with director AR Murugadoss?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement