Advertisement

మంత్రి పదవినుండి ఈటెల తొలగింపు

Sun 02nd May 2021 09:13 PM
etela rajender,kcr cabinet,health minister,removed,cm kcr,telangana  మంత్రి పదవినుండి ఈటెల తొలగింపు
Etela Rajender removed for Cabinet మంత్రి పదవినుండి ఈటెల తొలగింపు
Advertisement

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర పై భూ కబ్జా ఆరోపణలు రావడం సీఎం కేసీఆర్ వెంటనే ఈటెల పై యాక్షన్ తీసుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఈటెల మీది కొన్ని టివి ఛానల్స్ లో వచ్చిన న్యూస్ తోనూ, పేద రైతుల కంప్లైంట్ తోనూ ఈటెల మీద యాక్షన్ షురూ చేసిన కేసీఆర్ ఈటెలపై విచారణ చెప్పట్టాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ని ఆదేశించారు. నిన్నటినుండి ఈటెల రాజేంద్ర ఫ్యామిలీకి చెందిన అచ్చం పేట, హకీమ్ పేట జామున హ్యాచరీస్ పొలాల్లో డిజిటల్ సర్వే నిర్వహించడం, అలాగే అస్సైన్డ్ భూములని ఈటెల ఆక్రమించారని మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పడంతో.. నిన్న ఈటెల రాజేంద్ర ని పోర్ట్ పోలియో నుండి తప్పిస్తూ వైద్య, ఆరోగ్య శాఖని కేసీఆర్ కి బదిలీ చేసుకున్నారు.

ఇక నేడు ఈటెల రాజేంద్ర భూ కబ్జాకి పాల్పడినట్లుగా నిర్దారణ కావడం, ఈటెల పై 20 మందికి పైగా కంప్లైంట్ ఇవ్వడంతో ఆయనని మంత్రి పదవి నుండి తప్పించారు కేసీఆర్. ఈటెల 100 ఎకరాల భూ కబ్జా చెయ్యకపోయినా.. 60 ఎకరాల భూకబ్జాకి పాల్పడినట్లుగా నిర్దారణ కావడం, ఈటెల మాత్రం ఇంకా మంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంతో కేసీఆర్ యాక్షన్ లో భాగంగా.. ఆయన మంత్రి పదవిని పీకేశారు కేసీఆర్. ఈటెల రాజేంద్ర ని మంత్రి పదవి నుండి తొలగిస్తున్నట్లుగా గవర్నర్ భవన్ నుండి ప్రకటన వెలువడడంతో.. అధికారికంగా ఈటెల మంత్రి పదవి నుండి తొలగించినట్టుగా తెలుస్తుంది.

Etela Rajender removed for Cabinet:

Etela Rajender removed for KCR Cabinet

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement