Advertisementt
CJ Ads

ప్రకాష్ రాజ్ వల్ల ఆగిన చైతు థాంక్యూ

Sat 01st May 2021 06:55 PM
naga chaitanya,vikram kumar,thank you movie,prakash raj,avika goer,raashi khanna,malavika nair,thank you movie shoot  ప్రకాష్ రాజ్ వల్ల ఆగిన చైతు థాంక్యూ
Chaitu Thank you shoot stopped by Prakash Raj ప్రకాష్ రాజ్ వల్ల ఆగిన చైతు థాంక్యూ
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - విక్రమ్ కుమార్ కాంబోలో థాంక్యూ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య మహేష్ అభిమానిగా కనిపించబోతున్నాడు. మహేష్ బ్యానర్ లకి పాలాభిషేకాలు చేస్తూ.. మహేష్ వీరాభిమాని గా చైతూ కనిపిస్తాడనే టాక్ ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య ముగ్గురు ముద్దగుమ్మలతో జోడి కట్టాడు. వెంకిమామ లో స్క్రీన్ షేర్ చేసుకున్న రాశి ఖన్నా తో, అలాగే ఈమధ్యన స్లిమ్ గా తయారైన అవికా గోర్ తోనూ, మరో హీరోయిన్ మాళవిక నాయర్ లతో రొమాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న నాగ చైతన్య థాంక్యూ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లుగా తెలుస్తుంది.

కారణం కోవిడ్ కాదట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్న ప్రకాష్ రాజ్ ఇటలీ కి వెళ్లకపోవడమేనట. అంటే ప్రస్తుతం ఇటలీ కి ఇండియా కి మధ్యన రాకపోకల నిషేధం మొదలవడంతో ప్రకాష్ రాజ్ థాంక్యూ టీం ని చేరుకోలేకపోవడంతో థాంక్యూ షూటింగ్ ని తాత్కాలికంగా ఆపేశారట. నాగ చైతన్య - హీరోయిన్స్ అంతా ఇటలీలో ఉండడం, నాగ చైతన్య - ప్రకాష్ రాజ్ కాంబో సీన్స్ చిత్రీకరించాల్సి ఉండగా ప్రకాష్ రాజ్ అందుబాటులోకి రాలేకపోవడంతో థాంక్యూ షూటింగ్ ఆపేసినట్లుగా చెబుతున్నారు. 

Chaitu Thank you shoot stopped by Prakash Raj:

Naga Chaitanya - Vikram Kumar Thank You Movie Shooting stopped 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ