త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబో అనగానే ఓ సాలిడ్ అతడు, ఓ కామెడీ ఎంటర్టైనర్ ఖలేజా గుర్తుకు రాక మానవు. కమర్షియల్ హిట్స్ అనేది పక్కనబెడితే మహేష్ - త్రివిక్రమ్ కాంబో బుల్లితెర మీద ఇప్పటికి విపరీతమైన క్రేజ్ ఉన్న హిట్ జోడి. అయితే ఇప్పుడు మూడో సినిమాగా వాళ్ళ కాంబోలో SSMB28 మొదలు కాబోతుంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని మహేష్ మూవీ చేస్తున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కి రాజమౌళికి మధ్యలో త్రివిక్రమ్ మూవీ మొదలు పెడుతున్నాడు మహేష్. ఇప్పుడు అదే అనౌన్సమెంట్ ఇచ్చారు నిర్మాతలు హరిక అండ్ హాసిని వారు.
11 ఏళ్ళ తర్వాత మరోసారి త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబో రిపీట్ కాబోతుంది అని.. త్రివిక్రమ్ - మహేష్ కాంబో మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది, సమ్మర్ 2022 లో రిలీజ్ అంటూ అధికారికంగా ప్రకటించారు. హారిక హరిసి క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు నిర్మాతగా మొదలు కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు ప్రచారంలో ఉంది. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ - మహేష్ తో మూవీ అనగానే ఆ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.