Advertisementt

త్వరలోనే స్వీటీ పెళ్లి

Thu 29th Apr 2021 11:45 AM
anushka shetty wedding singapore businessman wedding rumours  త్వరలోనే స్వీటీ పెళ్లి
Wedding bells ringing for Anushka త్వరలోనే స్వీటీ పెళ్లి
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో పెళ్లికాని సీనియర్ హీరోయిన్స్ లో ముందుగా అనుష్క, త్రిష లే ఉంటారు. కాజల్, సమంత పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ లో కూడా దూసుకుపోతున్నారు. కానీ స్వీటీ అనుష్క పెళ్లి విషయం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవడమే కానీ.. స్వీటీ పెళ్లిపై క్లారిటీ ఇవ్వదు. ఎప్పటినుండో ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగినా, అటు ప్రభాస్ ఇటు అనుష్క ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. నిశ్శబ్దం తర్వాత ఎలాంటి సినిమాకి సైన్ చెయ్యని అనుష్క త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

దుబాయ్ కి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో అనుష్క వివాహం జరగబోతుంది.. అయితే ఇక్కడ అనుష్క పెళ్లి విషయంలో ఓ ట్విస్ట్ ఉంది అంటున్నారు. అదేమిటంటే అనుష్క ని పెళ్లి చేసుకోబోయే ఆ వ్యాపారవేత్త అనుష్క కన్నా వయసులో చిన్నవాడని ప్రచారం జరుగుతుంది. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇరు కుటుంబాలు పెళ్లి పై ఓ మాట అనుకుని పెళ్లి ముహుర్తాలు పెట్టుకుంటారని, ఈ పెళ్లి కోసమే అనుష్క సినిమాలు పక్కనబెట్టింది అనే టాక్ బాగా వినిపిస్తుంది.

Wedding bells ringing for Anushka:

Wedding bells are ringing for Anushka Shetty

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ