అఖిల్ మాస్ గా ట్రై చేస్తున్నాడు.. కానీ

ఇప్పటివరకు లవర్ బాయ్ గా చేసిన సినిమాలేవీ అఖిల్ కి ఎలాంటి హిట్ కట్టబెట్టలేదు. అఖిల్.. అసలెందుకు చేసాడో అఖిల్ కే తెలియాలి. హలో, మిస్టర్ మజ్ను ఈ రెండు సినిమాల్లో అఖిల్ లవర్ బాయ్ గా ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లోనూ అఖిల్ లవర్ బాయ్ లగే కనిపిస్తున్నాడు. తాజాగా అఖిల్.. సురేందర్ రెడ్డితో మొదలు పెట్టిన మూవీలో మాస్ గా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. స్పై కేరెక్టర్ లో అఖిల్ మాస్ గా లుక్ మార్చేశాడు. ఏజెంట్ లుక్ లో అఖిల్ చేతిలో సిగరేట్‌తో పొగను వదులుతూ స్టైలీష్‌గా ఉన్నాడు. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ పాయింట్‌‌ను  సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

అయితే అఖిల్ మాస్ లుక్ లో సూపర్బ్ అందులో సందేహం లేదు. కాకపోతే సురేందర్ రెడ్డి సినిమాల్లో హీరోలని మాస్ లుక్ లో ప్రెజెంట్ చేసిన సినిమాలేవీ ఆడలేదు. అంటే మహేష్ బాబు ని అతిధి సినిమాలో సురేందర్ రెడ్డి కొత్త లుక్ లో మాస్ గా చూపిస్తే ఆ సినిమా అట్టర్ ప్లాప్. ఇక ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ ని హెయిర్ పెంచి అదోమాదిరిగా చూపిస్తే ఆ సినిమా ఆడలేదు. రవితేజ ని కిక్ 2 లో వెరైటీ గా చూపించి డిజాస్టర్ ప్లాప్ కొట్టాడు. ఇప్పుడు అక్కినేని అభిమానుల్లోనూ అదే కంగారు పుడుతుంది. 

అఖిల్ ని మాస్ గా సూపర్ గా చూపిస్తున్నాడు. అఖిల్ కి పక్కా మాస్ ఫిలిం కావాలి.. మాస్ గా సూపర్ గా చూపించి కంటెంట్ లేకుండా చేస్తే కష్టం అంటూ సురేందర్ రెడ్డి కి అక్కినేని ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.

Akhil Akkineni sports thick beard and messy hair

Akhil Mass look in Agent Movie
akhil akkineni
akhil
hello
mister majnu
agent movie
maas movie
surender reddy movie
akhil - surender reddy combo
agent akhil