అఖండకి అదిరిపోయే రేటు

Sun 18th Apr 2021 12:40 PM
bb3,akhanda movie,balakrishna,boyapati,hotstar,digital streaming rights,balakrishna akhanda  అఖండకి అదిరిపోయే రేటు
Hotstar grabs Digital Streaming Rights Of Akhanda అఖండకి అదిరిపోయే రేటు

బాలకృష్ణ - బోయపాటి కాంబో అంటేనే  విపరీతమైన క్రేజు, బజ్ ఉంటుంది. సింహ, లెజెండ్ మూవీస్ తర్వాత వారి కాంబోలో BB3 గా తెరకెక్కుతున్న అఖండ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బాలకృష్ణ మాస్ అవతార్, అఖండగా బాలయ్య లుక్ తో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు అఖండ టీజర్ పెంచేసింది. యూట్యూబ్ లో అఖండ టీజర్ ట్రేండింగ్ లో ఉంది. బాలకృష్ణ మాస్ అవతార్ కి బోయపాటి మాస్ డైరెక్షన్ అన్ని సినిమాపై క్రేజ్ ని హైప్ ని పెంచేస్తున్నాయి. మే 28 ఎన్టీఆర్ జయంతి రోజున అఖండ రిలీజ్ కాబోతుంది.

ప్రస్తుతం అఖండ బిజినెస్ ఊపందుకుంది. అఖండ టీజర్ తర్వాత అఖండ లెక్కలు మారిపోయాయి. అందులో భాగంగానే అఖండ సినిమా డిజిటల్ రైట్స్ కి భారీగా డిమాండ్ ఏర్పడింది. అఖండ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని హాట్ స్టార్ భారీ ధరకు ఎగరేసుకుపోయింది అని.. ఏకంగా 15 కోట్లకి అఖండ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్ అమ్ముడుపోయాయని తెలుస్తుంది. సింహ స్టార్ మా, లెజెండ్ జెమిని ఛానల్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నాయి. ఇప్పుడు అఖండ డిజిటల్ రైట్స్ ని హాట్ స్టార్, శాటిలైట్ హక్కులని స్టార్ మా దక్కించుకున్నాయి.

Hotstar grabs Digital Streaming Rights Of Akhanda:

Hotstar grabs Digital Streaming Rights Of Balakrishna - Boyapati Akhanda