Advertisementt

రాధేశ్యామ్ లవ్ ట్రాక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Sat 17th Apr 2021 11:12 AM
radhe shyam movie,prabhas looks,prabhas,pooja hegde,radhakrishna,radhe shyam pan india film  రాధేశ్యామ్ లవ్ ట్రాక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting news on Radhe Shyam love track రాధేశ్యామ్ లవ్ ట్రాక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ పై బజ్ క్రియేట్ అవడం లేదు. అందులో పూజ హెగ్డే లుక్ తప్ప ప్రభాస్ లుక్స్ ఎన్నివిధాలుగా చూపించినా ఫాన్స్ కి ప్రేక్షకులకి ఎక్కడం లేదు. ప్రభాస్ రాధేశ్యామ్ ని పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్నా ఆ క్రేజ్ సినిమాపై కనిపించడం లేదు. సాహో అప్పుడు ఆ సినిమాపై ప్రభాస్ పై విపరీతమైన హైప్ ఉంటే.. రాధేశ్యామ్ పై ఎలాంటి బజ్ లేదు. ఇక రొమాంటిక్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారట. రెట్రో స్టయిల్ ఇలా ఆ పాత్ర కోసం దర్శకుడు చాలా కష్టపడుతున్నాడట.

అయితే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ తక్కువ, రొమాంటిక్ అంటే లవ్ స్టోరీ పార్ట్ ఎక్కువ ఉండబోతుంది. ఎక్కువగా మాస్ హీరోగా ప్రోజెక్ట్ అయిన ప్రభాస్ ఫస్ట్ టైం ఇలాంటి ఓ గెటప్, కేరెక్టర్ లో కనిపిస్తాడట. అయితే ఈ రాధేశ్యామ్ కథలో ప్రభాస్ - పూజ ఎక్కడ కలుస్తారనే దాని మీద ఓ స్టోరీ ప్రచారం లోకి వచ్చింది. పూజ హెగ్డే స్టూడెంట్ గా కనిపిస్తుందట. ఆమె ఓ హాస్పిటల్ లో పని చేస్తుండగా.. ప్రమాదానికి గురైన ప్రభాస్ అక్కడికి వస్తాడు. ప్రభాస్ కోలుకోవడంలో పూజ పాత్ర ప్రధానమైన పాత్ర పోషిస్తుందట. దానితో వాళ్ళ మధ్యన లవ్ మొదలవుతుందట. వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్న రాధేశ్యామ్ మూవీలో ఓ సాంగ్ తప్ప మిగతా పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయినా.. ఇప్పుడు రాధేశ్యామ్ రీ షూట్ మేటర్ ఒకటి బయటికి వచ్చింది. అందులో నిజమెంతుందో.. జస్ట్ వెయిట్ అండ్ సీ.

Interesting news on Radhe Shyam love track:

How Radhe Shyam Love Begins

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ