పుష్ప ఫైట్స్ రేంజ్ 40 కోట్లు

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ అయ్యి ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మాస్ లుక్ లో అల్లు అర్జున్ చేసిన ఫైట్స్ పుష్ప కే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ పుష్ప విలన్ గా నటిస్తున్నాడు. అయితే పుష్ప పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది అని పుష్ప టీజర్ చూస్తే క్లియర్ గా అర్ధమవుతుంది. అంటే సినిమాలో యాక్షన్ పార్ట్ భీభత్సంగా సుకుమర్ డిజైన్ చేసాడని తెలిసిపోతుంది. అల్లు అర్జున్ పోలీస్ లతో చేసే ఫైట్, లారీ డ్రైవర్ గా చేసే ఛేజింగ్ ఫైట్ విజువల్స్ టీజర్ లో చూపించేసారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి ఈ యాక్షన్ పార్ట్ మెయిన్ హైలెట్ గా ఉండబోతుంది. అందుకే పుష్ప యాక్షన్ పార్ట్ కోసమే 40 కోట్లు బడ్జెట్ పెడుతున్నారట మేకర్స్. బన్నీ తగ్గేదే లే అంటూ చేసే ఫైట్స్ కోసం అక్షరాలా 40 కోట్ల ఖర్చు ఉంటుందట. ఈ సినిమాలో చేజింగ్ లు, యాక్షన్ పార్ట్స్ అన్ని కలిపి ఓ 6 సీక్వెన్స్ లు ఉండబోతున్నాయట. ఫారెస్ట్ లో ఓ యాక్ష‌న్ సీన్ ని ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్స్ ఆధ్వ‌ర్యంలో చిత్రించారట. ఈ ఒక్క ఫైట్ కే.. కేవలం 6 నిమిషాల కోసం 6 కోట్లు ఖర్చుపెట్టారు నిర్మాతలు. ఒక్కో ఫైట్ సీన్ ఒక్కో ఆణిముత్యముగా పుష్ప లో నిలవబోతుందట. అందుకే ఖర్చుకి వెనకాడకుండా ఈ యాక్షన్ పార్ట్ కి సుకుమార్ అధిక ప్రాధాన్యతనిస్తున్నాడట. ఇక పుష్ప ప్రీ క్లయిమాక్స్ ఫైట్, క్లయిమాక్స్ ఫైట్ వేరే లెవల్లో ఉండబోతున్నాయని టాక్.

Pushpa: 6-Minute Action Scene Worth Rs 6 Crore

Pushpa Fight Range 40 crores
pushpa movie
allu arjun
action scenes
pushpa pan india movie
action entertainer
sukumar
allu arjun action
fahadh faasil