Advertisement

ఫిదా స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు

Tue 06th Apr 2021 11:23 PM
sekhar kammula,alitho saradaga,promo,fida movie,mahesh,ram charan  ఫిదా స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు
Fidaa Movie Rejected By Star Heroes ఫిదా స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు
Advertisement

వరుణ్ తేజ్ - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల మ్యాజిక్ లవ్ స్టోరీ ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్టో.. అందులో సాయి పల్లవి నటన, ఆమె డాన్స్ అన్ని ఆణిముత్యాలే. తెలంగాణ అమ్మాయికి అమెరికా అబ్బాయికి ప్రేమతో ముడిపెట్టి ఓ అద్భుతమైన లవ్ స్టోరీలా ఫిదా సినిమాని తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. అలాంటి స్రిప్ట్ ని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన విషయం రీసెంట్ గా శేఖర్ కమ్ముల ఓ షో లో రివీల్ చేసారు. అలీ తో సరదాగా ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చిన శేఖర్ ఖమ్ములని అలీ.. మీరెందుకు స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యరు, వాళ్లతో కంఫర్ట్ గా ఉండదనా? లేదంటే మీరు వాళ్ళని హ్యాండిల్ చెయ్యలేరనా? దానికి ఆయన అలాంటిదేం లేదు.. నా ఫిదా స్టోరీని ఇద్దరు స్టార్ హీరోలకి వినిపించాను.

మహేష్, రామ్ చరణ్ ఇద్దరికి ఫిదా స్టోరీ ని వినిపించాను. కానీ వాళ్ళు లైట్ తీసుకున్నారు. వాళ్ళు రిజెక్ట్ చేసారని నేనేం ఫీల్ అవ్వలేదు అంటూ శేఖర్ కమ్ముల ఫిదా స్టోరీని మహేష్, రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన విషయాన్ని ఆ షోలో బయట పెట్టారు. ఇక మీ పిల్లలు మీ సినిమాలను చూసి జేడ్జ్ చేస్తారా అంటే.. అసలు మా పిల్లలకి నా సినిమాలు నచ్చవు. మీ సినిమాల్లో అలీ, బ్రహ్మానందం గార్లు ఎందుకు ఉండరు అని అడుగుతుంటారు అనగానే అలీ అందుకుని అవును మీకు కామెడీ నచ్చదా? కామెడీ అంటే వామిటింగ్స్ అవుతాయా? దానికి శేఖర్ కమ్ముల అదేం లేదండి.. మా వైఫ్ కూడా బ్రహ్మానందం అలీ గార్లని ఎందుకు పెట్టరు అని అడుగుతుంది అనగానే అలీ మీ పిల్లలకి, మీ వైఫ్ కి బొకే పంపిస్తాను మమ్మల్ని అడిగినందుకు అంటూ నవ్వేసాడు. జస్ట్ అలీ తో సరదాగా ప్రోమోలోనే ఇదంతా ఉంటే.. ఆ ఎపిసోడ్ చూస్తే ఇంకెన్ని విషయాలు శేఖర్ కమ్ముల బయట పెడతారో.. చూడాలంటే మండే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Fidaa Movie Rejected By Star Heroes:

Sekhar Kammula Alitho Saradaga promo

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement