పవన్ కళ్యాణ్ హీరో కాదు.. కేరెక్టర్ ఆర్టిస్ట్

Sun 04th Apr 2021 08:38 PM
ycp mla,gudivada amarnath reddy,hot comments,pawan kalyan,pawan vakeel saab,vakeel saab pre release event  పవన్ కళ్యాణ్ హీరో కాదు.. కేరెక్టర్ ఆర్టిస్ట్
Gudivada Amarnath Reddy hot comments on Pawan Kalyan పవన్ కళ్యాణ్ హీరో కాదు.. కేరెక్టర్ ఆర్టిస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో పవన్ ఫాన్స్, అతిరథమహారధుల మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు.. అటు రాజకీయాల్లోనూ యాక్టీవ్ పాత్ర పోషిస్తున్నారు. నిన్న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాద యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభత్వం, ఏపీ సీఎం జగన్ పై సంచనలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బాబాయ్ వివేకా హత్య కేసు విషయంలో ఏమి చెయ్యని జగన్ ఏపీ ప్రజలకు ఏం చేస్తారు అంటూ జగన్ పై తీవ్ర విమర్శలు చేసారు.

అయితే పవన్ వ్యాఖ్యలకు వైసిపి మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. అందులో వైసీపీ నేత గుడివాడ అమర్నాద్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్ హీరోకి తక్కువ, కేరెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ. ఆయన హీరో కాదు.. కేరెక్టర్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉంటే.. పొలిటికల్ కాల్షీట్స్, బిజీగా ఉండడానికి సినిమాల కాల్షీట్స్.. అంటూ ఎద్దేవా చెయ్యడమే కాదు.. వివేకా హత్య గురించి సీబీఐ చూసుకుంటుంది ముందు మీ పని మీరు చూసుకోండి అంటూ పవన్ పై విరుచుకుపడ్డారు. 

Gudivada Amarnath Reddy hot comments on Pawan Kalyan:

YCP MLA Gudivada Amarnath Reddy hot comments on Pawan Kalyan