Advertisement

మూణ్ణాళ్ళ ముచ్చట కాదు.. ఒక్క రోజు ముచ్చటే

Wed 10th Mar 2021 12:23 PM
bigg boss fame,harika,harika alekya,telangana tourism,details removed,website,controversy  మూణ్ణాళ్ళ ముచ్చట కాదు.. ఒక్క రోజు ముచ్చటే
Harika Removed from Telangana Tourism Website మూణ్ణాళ్ళ ముచ్చట కాదు.. ఒక్క రోజు ముచ్చటే
Advertisement

ఏదైనా పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపొతే .. చూడండి రా.. మూణ్ణాళ్ళ ముచ్చట అంటారు. కానీ ఒక్క రోజే పదవి ఇచ్చినట్టే ఇచ్చి.. లాగేసుకుంటే.. దాన్నేమంటారో. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ దేత్తడి హారిక పరిస్థితి అలానే ఉంది. బిగ్ బాస్ కి వెళ్ళకముందు దేత్తడి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ యాసలో వీడియోస్ చేసి ఫెమస్ అయిన హారిక - అలేఖ్య బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ కి చేరి క్రేజ్ తెచ్చుకుంది. అభిజిత్ తో క్లోజ్ గా మూవీ అవుతూ.. గ్లామర్ షో తోనూ హారిక బాగా హైలెట్ అవడంతో బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక హారిక క్రేజ్ బాగా పెరిగింది. అయితే రీసెంట్ గా హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం, దానికి సంబందించిన అధికారిక ప్రకటన ఇవ్వడం తో హారిక ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యింది. 

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దీనికి సుమబందించిన నియామక పత్రం కూడా హరికకి అందించేసారు. అక్కడే అసలు కథ మొదలైంది. చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సొంత నిర్ణయంతో హరికకి తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా పదవి ఇవ్వడం ఆ శాఖా మంత్రి కి అలాగే తెలంగాణ సీఎంవో కి నచ్చకపోవడంతో.. టూరిజం శాఖ ఉన్నతాధికారులు టూరిజం శాఖ వెబ్ సైట్ నుంచి హారిక డీటెయిల్స్ ను తొలగించారు. అసలు సొంత నిర్ణయంతో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఇలా ఎలా చేస్తారని తెలంగాణ సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కి వార్నింగ్ ఇవ్వడంతో హారిక డీటెయిల్స్ ఇమ్మిడియట్ గా టూరిజం శాఖ వెబ్ సైట్ నుంచి తొలగించారు. 

అయితే తెలంగాణ అమ్మాయి హారిక కి అంత సెలెబ్రిటీ హోదా లేదని, ఆ నియామకం నుండి తొలగించరా? లేదంటే మరేదన్నా రాజకీయ కారణమో తెలియదు కానీ.. పాపం హారికకి పదవి వచ్చినట్టే వచ్చి ఒక్క రోజులో చేజారిపోవడంతో బాగా ఫీలవుతున్నట్టుగా తెలుస్తుంది. 

Harika Removed from Telangana Tourism Website:

Alekhya Harika Details removed from Telangana tourism website after controversy

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement