Advertisement

శ్రీకారం ట్రైలర్: శ్రీమంతుడు 2

Fri 05th Mar 2021 08:46 PM
sreekaram movie,sharwanand sreekaram movie,sreekaram trailer,srimanthudu 2,sharwanand,priyanka,director kishore  శ్రీకారం ట్రైలర్: శ్రీమంతుడు 2
Sreekaram Trailer: Srimantudu 2 శ్రీకారం ట్రైలర్: శ్రీమంతుడు 2
Advertisement

సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు హీరోయిన్ చెప్పింది కదా అని విలేజ్ కి వచ్చి వ్యవసాయం చెయ్యడం, ఎలాంటి సదుపాయాలకు నోచుకోని పల్లెటూరికి రోడ్లు వేయించి, చెరువులు తవ్వించి.. లిక్కర్ ఫ్యాక్టరీ కోసం భూములను అమ్మమన్న విలన్స్ ని చితక్కొట్టి ఆ పల్లెటూరికి అండగా నిలిచిన హీరో కథ శ్రీమంతుడు. మహేష్ - కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు ఇదే తరహాలో శర్వానంద్ - కిషోర్ కాంబోలో వస్తున్న సినిమా శ్రీకారం కూడా ఉండబోతుంది అనిపిస్తుంది. 

సిటీ లో క్లాస్ గా సాఫ్ట్ వెర్ చేసుకునే కుర్రాడు వ్యవసాయం చేస్తా అంటూ పల్లెటూరికి వెళ్లి అక్కడ రైతులా లుంగీ కట్టి ట్రాక్టర్ ఎక్కితే అందులో ఉండే ఆనందమే వేరు అంటాడు హీరో శర్వానంద్. ప్రొక్లైన్ ఎక్కి.. మట్టి తవ్వుతూ.. చేతిలో పార పట్టుకుని వస్తానంటివో.. నువ్వు వస్తానంటివో అంటూ హీరోయిన్ ప్రియాంకతో పాటేసుకుని.. ఆ పల్లెటూరిలో లోకల్ గా వుండే విలన్ సాయి కుమార్ ని ఎదుర్కుంటూ హీరో వ్యవసాయం ఎలా చేసాడన్నది ఈ శ్రీకారం సినిమా కథ అనేది రీసెంట్ గా విడుదలైన శ్రీకారం ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 

శర్వా క్లాస్ లుక్స్ సూపర్. అలాగే హీరోయిన్ ప్రియాంక గ్లామర్ గా బావుంది. సాయి కుమార్ యంగ్ విలన్ అవతారంలో మెప్పిస్తున్నాడు. రావు రమేష్ బరువైన రైతు పాత్రని మోస్తున్నాడు. కొన్ని చూసి నేర్చుకోవాలి, కొన్ని చేసి నేర్చుకోవాలి అంటూ భారమైన డైలాగ్స్ తో రావు రమేష్ పాత్ర కనబడుతుంది. ఇక సీనియర్ నరేశ్.. పక్క పొలం వాళ్లతో గొడవ పడుతుంటే.. చిలికి చిలికి గాలి వానైనట్లు.. గొడవలు ముదిరి గట్లేసుకునే వరకు వచ్చింది అంటూ బ్యాగ్ రౌండ్ లో చెబుతున్న డైలాగ్ బావుంది. సత్య కామెడీ, వ్యవసాయం అంటే పేకాట వ్యాపారం అయ్యిపోయింది అంటూ రైతులు పడే కష్టాలను తీర్చే రైతు గా శర్వానంద్ కనిపిస్తున్న ఈ  శ్రీకారం మహాశివరాత్రికి రిలీజ్ కాబోతుంది.

Click Here to: Sreekaram Trailer

Sreekaram Trailer: Srimantudu 2:

Sreekaram Trailer Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement