Advertisementt

రామ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది

Thu 18th Feb 2021 10:57 AM
hero ram,lingusamy,movie announced,srinivasaa chitturi  రామ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
Ram-Lingusamy Film Announced రామ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ శంకర్ తో మంచి మాస్ హిట్ కొట్టిన హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ చేసాడు. రెడ్ మూవీ ని ఓటిటి కి అమ్మమన్నా కుదరదు అంటూ సంక్రాంతి బరిలో వదిలాడు. రెడ్ సినిమా సో సో హిట్ తోనే రామ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇస్మార్ట్ తర్వాత రామ్ రెడ్ తో సర్దుకుపోయాడు. కానీ రెడ్ తర్వాత రామ్ సైలెంట్ గా ఫోటో షూట్స్ అంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాడు. తన తదుపరి చిత్రం విషయంలో కామ్ గానే ఉన్నాడు. అయితే రామ్ తర్వాత ఏమిటి అని ఆలోచిస్తున్న అభిమానులకి రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో కమిట్ అవ్వబోతున్నాడనే న్యూస్ బయటికి వచ్చింది.

తాజాగా రామ్ - లింగుస్వామి సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగు, తమిళ్ లో బై లింగ్యువల్ మూవీగా రామ్ నెక్స్ట్ ఉండబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. గతంలో లింగుస్వామి బన్నీతో ఓ మూవీ చెయ్యాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు చేసాక ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో రామ్ లింగుస్వామితో చేస్తున్నాడో? లేదంటే ఫ్రెష్ కథకి కమిట్ అయ్యాడో కానీ.. ప్లాప్ దర్శకుడు లింగు స్వామితో రామ్ కమిట్ అవడం రామ్ అభిమానులను కలవపరుస్తుంది. కొన్నాళ్లుగా లింగుస్వామికి అన్ని ప్లాపులే. అందులోను తమిళ హీరోలు పక్కనబెట్టిన డైరెక్టర్ తో రామ్ తన నెక్స్ట్ మూవీ ప్రకటించడం కాస్త షాకింగ్ విషయం అనే చెప్పాలి.

Ram-Lingusamy Film Announced:

RAPO19 Announced

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ