ఏపీలో జగన్ ప్రభుత్వం పేదల కోసమే పథకాలు ప్రవేశపెట్టే ప్రభుత్వం అంటూ ఊదరగొట్టడమే. కానీ వాళ్ళు ప్రవేశ పెట్టిన పథకాలు పేదవారికి అందుతున్నాయా అనేది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే స్థానిక సంస్థలకు ముందే ఇంటింటికి రేషన్ అంటూ ఏపీ ప్రభుత్వం మొదలు పెట్టిన పథకం కోసం కోట్లు ఖర్చు పెట్టి 9 వేల 230 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసి.. ఇంటింటికి రేషన్ అంటూ మొదలు పెట్టగా.. ఆ పథకం ఇప్పుడు అట్టర్ ప్లాప్ అయ్యినట్లే కనబడుతుంది. జగనన్న ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాడని ఎదురు చూస్తున్న ప్రజలకు భారీ షాక్ తగిలింది. కోట్లు వెచ్చించి కొన్న వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. మరోవైపు మా వల్ల కాదంటూ వాహనాల డ్రైవర్స్ చేతులెత్తేశారు. ఇంటింటికి రేషన్ పథకం కోసం పెట్టిన పెట్టుబడి ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. అటు ప్రజలను ఆకర్షించలేక ఇటు ఉపాధి కల్పిస్తున్నామంటూ డ్రైవర్స్ కి ఆశ చూపిస్తే వాళ్ళనుండి వ్యతిరేఖత ఎదుర్కుంటూ, ఇటు పెట్టుబడి వృధా అవుతూ అన్నిటికి రెడ్డ చేవడిలా జగన్ ప్రభుత్వం మిగిలి పోయింది.
ప్రభుత్వం ఈ పథకం కోసం కొన్న వాహనాలులో ఒక్కో రేషన్ వాహనం నెలకు 1800 మంది కార్డు దారులకు ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలి. కానీ వీధి చివర బండి పెట్టి ప్రజలను లైన్ లో పెట్టి ఆ రేషన్ పంపిణి చేపట్టారు. మరోపక్క రేషన్ డీలర్ దగ్గర నుండి బస్తాలు మోస్తూ.. అలాగే ఇంటింటికి రేషన్ పంపిణి చేసే విషయంలో ఇప్పుడు డ్రైవర్స్ చేతులెత్తేసి ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు. రోజుకి వంద మందికి రేషన్ పంపిణి అసాధ్యం అని, అలాగే పని భారం కూడా ఎక్కువే అని, పెట్రోల్ ఖర్చుల విషయంలోనూ మా వల్ల కాదంటున్నారు డ్రైవర్స్. కేవలం 16 వేలకి ఇంత కష్టం మా వల్ల కాదంటూ డ్రైవర్స్ చేతులు ఎత్తెయ్యడంతో ఇప్పుడు ఇంటింటికి రేషన్ పథకం మూలాన పడే పరిస్థితి వచ్చింది.
ఎన్నికల కోడ్ కారణంగా ఇంకా గ్రామాల్లో ఈ పథకం ప్రారంభం కాలేదు. జస్ట్ సిటీస్ వరకే ఇప్పుడు ఇన్ని సమస్యలంటున్న డ్రైవర్స్.. రేవు గతుకుల రోడ్ల మీద ఇంతటికి వెళ్లి రేషన్ ఇచ్చే విషయంలో మరెన్ని ఇబ్బందులు బయటికి వస్తాయో అంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా గ్రామాల్లో ఈ పథకాన్ని పక్కన బెట్టారు. కాబట్టి సరిపోయింది లేదంటే అక్కడ ఎంత గోల జరిగేదో.