Advertisement

దిల్ రాజు ప్రతీకార చర్య చేపట్టేనా.?

Wed 03rd Feb 2021 10:49 PM
dil raju,warangal srinu,solo release,krack movie,vakeel saab,nagarjuna,wild dog movie  దిల్ రాజు ప్రతీకార చర్య చేపట్టేనా.?
dil raju started to take his revenge? దిల్ రాజు ప్రతీకార చర్య చేపట్టేనా.?
Advertisement

ఈ సంక్రాంతి సినిమాలు థియేటర్స్ దగ్గర బాగానే హడావిడి చేసాయి. అన్ని సినిమాలు పర్లేదు అనిపించుకుని గట్టెక్కాయి. అల్లుడు అదుర్స్ మినహా. అయితే నైజాం ఏరియా లో థియేటర్స్ వివాదం ఎంత రాద్ధాంతం అయ్యిందో అందరికి తెలిసిందే. క్రాక్ సినిమా నైజం ఏరియా కి పంపిణి చేసిన వరంగల్ శ్రీను తనకి సరైన థియేటర్స్ దక్కనివ్వలేదంటూ ఓపెన్ గా కంప్లైంట్ చేస్తూ తెగించి మరీ మీడియా ముందుకు వచ్చేసాడు. దిల్ రాజు, శిరీష్ లపై ఓపెన్ గా విమర్శలు గుప్పించాడు. ఒకప్పుడు దాసరి లాంటి పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు ఇండస్ట్రీలోని ఇలాంటి పెద్ద సమస్యలు వెంటనే సద్దుమణిగిపోయేవి. 

ఇప్పుడు మాత్రం ఇలాంటి వాటిని పరిష్కరించే పెద్ద దిక్కు కోసం ఇంకా చూడాల్సి వస్తుంది. ఆ వివాదం ఇంకా అలానే కంటిన్యూ అవుతుండగానే.. మరోసారి అదే పరిణామాలు, అదే పరిస్థితులు రాబోతున్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే వరంగల్ శ్రీను క్రాక్ తర్వాత నైజాం ఏరియాలో రిలీజ్ చెయ్యబోతున్న సినిమా సీటిమార్. గోపీచంద్ - సంపత్ నంది - తమన్నా కాంబోలో తెరకెక్కిన సీటిమార్ ఏప్రిల్ 2 రిలీజ్ అనుకున్నారు. ఇక ఎలాగూ ఏప్రిల్ 9 న పెద్ద సినిమా వకీల్ సాబ్ ఉండనే ఉంది. అయితే దిల్ రాజు ఉన్నట్టుండి.. నాగార్జున వైల్డ్ డాగ్ ని ఏప్రిల్ 2 న థియేటర్స్ లో దించబోతున్నాడనేది తాజా సమాచారం.

ఏప్రిల్ 2 న తమవంటూ ఉన్న థియేటర్స్ అన్నిటిలోకి వైల్డ్ డాగ్ ని దింపి ఏప్రిల్ 9 నుండి వకీల్ సాబ్ ని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు. ఇది దిల్ రాజు ప్రతీకార చర్యే అనేది  ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆల్రెడీ ఆన్ లైన్ స్ట్రీమింగ్ కోసం నెట్ ఫ్లిక్స్ తో కమిట్ అయిపోయిన వైల్డ్ డాగ్ స్వయంగ నాగార్జునకే థియేటర్స్ లో దించడం ఇష్టం లేకపోయినా..దిల్ రాజు మాత్రం పట్టుబట్టి కావాలని వరంగల్ శ్రీనుకి సోలో రిలీజ్ దక్కకూడదు. ఓపెన్ గ్రౌండ్ ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యంతోనే నాగ్ వైల్డ్ డాగ్ ని థియేటర్స్ లోకి దింపుతున్నాడు.. నిజంగా ఇలాంటి ప్రతీకార చర్య దిల్ రాజు లాంటి పెద్ద మనిషి చేపట్టొచ్చా? చేపడతాడా?

dil raju started to take his revenge?:

Dil Raju Takes Sensational Decision on Last Two weeks incidents

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement