Advertisementt

ముంబై కి మకాం మార్చిన కుర్ర హీరో

Wed 03rd Feb 2021 06:07 PM
bellamkonda srinivas,chatrapathi remake,vinayak,mumbai  ముంబై కి మకాం మార్చిన కుర్ర హీరో
Tollywood hero who moved to Mumbai ముంబై కి మకాం మార్చిన కుర్ర హీరో
Advertisement
Ads by CJ

ఇప్పుడు చాలామంది హీరోలు పాన్ ఇండియా ఫిలిమ్స్ అంటూ ముంబై కి చెక్కేస్తున్నారు. ప్రభాస్ వరస పాన్ ఇండియా ఫిలిమ్స్ తో ఎక్కువగా ముంబైలోనే తిరుగుతున్నాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప ఇంకా ఆంధ్ర, తెలంగాణ అడవుల చుట్టూనే తిరుగుతుంది. విజయ్ దేవరకొండ- పూరి లైగర్ షూట్ ముంబైలోనే ఉంటుంది. కానీ ఇంకా విజయ్ ముంబై కి వెళ్ళలేదు. మరోపక్క ఎన్టీఆర్ - రామ్ చరణ్ షూటింగ్ ని ఈమధ్యన హైదరాబాద్ పరిసరాల్లోనే  చక్కబెట్టేసాడు రాజమౌళి. అయితే ఇప్పుడు హిందీ లో హీరోగా లాంచ్ అవుతున్న బెల్లంకొండ హీరో హైదరాబాద్ నుండి ముంబై కి మకాం మార్చేశాడు.

వినాయక్ దర్శకుడిగా రాజమౌళి హిట్ ఫిలిం ఛత్రపతి ని హిందీలో రీమేక్ చెయ్యబోతున్న బెల్లకొండ శ్రీనివాస్.. ఇప్పుడు ముంబై లో దిగాడు. అల్లుడు అదుర్స్ తో ఐపు లేకుండా పోయిన బెల్లంకొండ శ్రీనివాస్ ఖాళీగా లేడు. ముంబై చెక్కేసి అక్కడ ఓ పోష్ ఏరియా లో ఇల్లు అద్దెకు తీసుకోవడమే కాదు అక్కడే జిమ్ వగైరా పనులు మొదలు పెట్టాడు. బాలీవుడ్ అంటే ముంబై.. ముంబై అంటే బాలీవుడ్ కదా అందుకే మనోడు కూడా ముంబై లో ఉంటె క్రేజ్ వస్తుంది కదా అని అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఛత్రపతి రీమేక్ కూడా ముంబైలో షూట్ చేస్తారు గనక బెల్లంకొండ అక్కడికి జంప్ అయ్యాడు అన్నమాట.

Tollywood hero who moved to Mumbai:

Bellamkonda Shift to Mumbai

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ