Advertisementt

కూచిపూడి వారి వీధిలో అడ్డాల వారు!

Sun 24th Jan 2021 10:26 AM
srikanth addala,chanti addala  కూచిపూడి వారి వీధిలో అడ్డాల వారు!
Srikanth Addala Next Movie Kuchipudi Vari Veedhilo కూచిపూడి వారి వీధిలో అడ్డాల వారు!
Advertisement
Ads by CJ

బ్రహ్మోత్సవం సినిమా దెబ్బకి బాగా గ్యాప్ వచ్చిన శ్రీకాంత్ అడ్డాలా ఎట్టకేలకి వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ అసురన్ సినిమా రీమేక్ నారప్ప సినిమా చేస్తున్నాడు. నారప్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగానే.. నెక్స్ట్ సినిమాకి కమిట్ అవ్వడమే కాదు.. కన్ఫర్మ్ కూడా చేసేసాడు శ్రీకాంత్ అడ్డాల. విశేషం ఏమిటి అంటే ముకుంద సినిమాతో మెగా హీరో వరుణ్ తేజ్ ని ఇంట్రడ్యూస్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో మరో హీరోని ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నాడు. హీరో ఎవరో స్టార్ సన్ కాదు. నిర్మాత చండి అడ్డాల కొడుకుని శ్రీకాంత్ అడ్డాలా హీరోగా పరిచయం చెయ్యబోతున్నాడు.
అల్లరి రాముడు, అడవి రాముడు, యముడికి మొగుడు లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేసిన చంటి అడ్డాల కొడుకుని హీరోగా లాంచ్ చెయ్యబోతున్నాడు. ఆ సినిమాకి కూచిపూడి వారి వీధిలో టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీజన్ బుల్ హిట్ అనిపించుకున్నా.. ఆ సినిమాలో ఉన్న నేటివిటీకి మాత్రం కొంతమంది హార్డ్ కొర్ ఫాన్స్ ఉన్నారు. ఆ స్లాంగ్, గోదావరి వాటికీ. మళ్ళీ మరోసారి శ్రీకాంత్ అడ్డాల గోదావరి జిల్లాల నేపథ్యంలో కూచిపూడి వారి వీధిలో సినిమాని చెయ్యబోతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే.. ఈ సినిమాకి బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. బన్నీ వాస్ తో కలిసి గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ అందరూ కోలబ్రెట్ అయ్యి ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు.

Srikanth Addala Next Movie Kuchipudi Vari Veedhilo:

Chanti Addala's Son Debut Movie 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ