Advertisement

అడ్డంకులను పక్కకు పెట్టి.. ఎన్నికల నోటిఫికేషన్

Sat 23rd Jan 2021 12:39 PM
ap,sec,ap government,panchayat polls,panchayat elections,nimmagadda ramesh kumar,jagan,ycp party  అడ్డంకులను పక్కకు పెట్టి.. ఎన్నికల నోటిఫికేషన్
SEC releases notification for first phase of panchayat polls in Ap అడ్డంకులను పక్కకు పెట్టి.. ఎన్నికల నోటిఫికేషన్
Advertisement

ఏపీలో ప్రభుత్వం vs ఎన్నికల కమిషన్.. అంటూ లోకల్ ఫైట్ గత ఏడాది మార్చి నుండి జరుగుతూనే ఉంది. ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కి ఏపీ ప్రభ్బుత్వానికి మధ్యన లోకల్ ఫైట్ కోర్టుకెక్కినా.. నువ్వా - నేనా అంటున్నారు తప్ప ఎవరికీ ఎవరూ తగ్గడం లేదు. కరోనా టైం లో స్థానిక సంస్థల ఎన్నికలు అస్యాద్యం అంటూ ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతానికి కరోనా అదుపులోనే ఉంది కదా.. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదు అని నిమ్మగడ్డ ఇలా ఉంది వారి ఫైట్. నిమగడ్డ అనుకున్నది జరగాలని ఆయన, నిమ్మగడ్డకు అంత సీన్ లేదని వైసిపి నేతలు.. ఇలా వార్ కంటిన్యూ అవుతున్న తరుణంలోనే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలకు తోలి నోటిఫికేషన్ జారీ చేసారు. దీనికి ఏపీ ఉద్యోగుల సంఘం ససేమిరా అంటుంది. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ ఎన్నికలు విధులకు హాజరు కాము అంటున్నారు.

కరోనా వ్యాక్సినేషన్ ముగిశాకే ఎన్నికలు నిర్వహించాలంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఏది ఏమైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఈ ఎన్నికలు జరగాలంటూ తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి అవాంతరాలు జరిగినా దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలంటూ.. నిమ్మగడ్డ స్పష్టం చేసారు. ఈ విషయమై గవర్నర్ కి నివేదిక అందజేస్తామని చెప్పారు. నాలుగు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు హాజరుగుతాయని నిమ్మగడ్డ చెప్పారు. విజయనగరం, ప్రకాశం జిల్లా మినహా తొలివిడత ఎన్నికలు 11 జిలాల్లో ఉంటాయని స్పష్టం చేసారు.

జనవరి 23 న నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ జనవరి 25 న అభ్యర్థుల నుండి నామినేషన్స్ స్వీకరణకు 27 వరకు గడువు ఇచ్చింది. ఇక నామినేషన్స్ ఉపసంహరించుకోవడానికి గడువు జనవరి 31 న ఉంటుంది. మధ్యలో నామినేషన్స్ పరిశీలన, అలాగే నామినేషన్స్ పై అభ్యంతరాలు ఉంటాయని నిమ్మగడ్డ తెలిపారు. ఫిబ్రవరి 5 న పోలింగ్ ఉంటుంది అని.. అది ఉదయం 6.30 నుండి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ ఉంటే.. నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల వెల్లడి చేస్తామని అని నిమ్మగడ్డ స్పష్టం చేసారు. ఇక రెండో దశ, మూడో, నాలుగో దశకు డేట్స్ ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసారు నిమ్మగడ్డ.

SEC releases notification for first phase of panchayat polls in Ap:

AP SEC releases notification for four-phase panchayat polls

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement