సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుగుతుంది. కరోనా వలన షూటింగ్ బాగా లేట్ అయిన పుష్ప చిత్ర షూటింగ్ ని సుకుమార్ మారేడుమిల్లి అడవుల్లో మొదలు పెట్టాక యూనిట్ సభ్యుడు అస్వస్తతతో కన్ను ముయ్యడంతో కొద్దీ రోజులు షూటింగ్ కి బ్రేకిచ్చినా.. న్యూ ఇయర్ తర్వాత బ్రేక్ అనేదే లేకుండా సుకుమార్ అండ్ టీం పుష్ప షూటింగ్ చిత్రకరణ చేపట్టారు. కనీసం సంక్రాంతికి విరామం కూడా తీసుకోకుండా సుకుమార్ అండ్ టీం మారేడుమిల్లి అడవుల్లోనే ఉండిపోయింది. సుకుమార్ ఇంకా పుష్ప యూనిట్ మొత్తం అక్కడ రంపచోడవరం ప్రాంతంలోనే తిష్ట వేశారు.
కానీ అల్లు అర్జున్ ఉదయమే షూటింగ్ కి జాయిన్ అయ్యి.. సాయంత్రానికి సిటీకి వెళ్ళిపోతున్నాడట. ప్రస్తుతం హీరో - హీరోయిన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారట సుకుమార్. ఇక అల్లు అర్జున్ షూటింగ్ ముగించుకుని అలా సిటీకి వెళ్లే క్రమంలోనే బన్నీ రంపచోడవరం ప్రాంతంలో గిరిజనుల నుండి ఊహించని స్వాగతం లభించిందట. అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ ముగించుకుని అటుగా వెళుతున్నాడు అని తెలియగానే తాళ్లపాలెం గిరిజనులు అల్లు అర్జున్ పై పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకోవడమే కాదు.. అల్లు అర్జున్ కి ఏకంగా హారతులు కూడా ఇచ్చారట. మరి వారి ప్రేమాభిమానాలకు ముగ్దుడైన అల్లు అర్జున్ వారికి అభివాదం చేసుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడట.