Advertisementt

హాస్పిటల్ పాలైన RRR బ్యూటీ!

Tue 19th Jan 2021 01:19 PM
alia bhatt,rrr movie,hospitalized,shooting,gangubai kathiawadi shoot  హాస్పిటల్ పాలైన RRR బ్యూటీ!
Hospitalized RRR Beauty! హాస్పిటల్ పాలైన RRR బ్యూటీ!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో యమా బిజీ షెడ్యూల్ తో ఉంది. బాలీవుడ్ బ్రహ్మాస్త్ర, గంగూబాయి కతియావాడీ, RRR పాన్ ఇండియా ఫిలిం షూటింగ్స్ తో అలియా భట్ బిజీ బిజీగా గడుపుతుంది. డిసెంబర్ లో RRR షూటింగ్ లో జాయిన్ అయిన అలియా భట్ డిసెంబర్ 31 న కొద్దిపాటి విరామం తీసుకుని బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ఫ్యామిలీతో న్యూ ఇయర్ వేడుకల కోసం రాజస్థాన్ వెళ్ళింది. ఇక తర్వాత RRR షూటింగ్ తో పాటుగా బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగూబాయి కతియావాడీ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.

అయితే సంక్రాంతి తర్వాత అలియా భట్ గంగూబాయి కతియావాడీ షూట్ లో తీరిక లేకుండా పాల్గొనడంతో కాస్త అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. గ్యాప్ లేకుండా షూటింగ్ చెయ్యడంతో అలియా భట్ కొద్దిపాటి నీరసంతో ముంబై ఆసుపత్రిలో చేరవలసి వచ్చినట్టుగా సమాచారం. ఒకరోజు డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉన్న అలియా భట్ తేరుకోవడంతో ఒక్కరోజులోనే ఆమెని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపినట్లుగా హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. సంజయ్ లీల భన్సాలీ డైరెక్షన్ లో అలియా భట్ గంగూబాయి పాత్రలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిన్న వయస్సులోనే గంగూబాయి వ్యభిచారంలోకి నెట్టబడి.. తరువాత ఆమె గ్యాంగ్‌స్టర్లతో కలిసి అత్యంత ప్రభావవంతమైన శక్తిగా ఎలా మారిందో అనేది  ఈ గంగూబాయి కతియావాడీ చిత్ర నేపథ్యం. కరోనా తో సినిమాలన్ని పోస్ట్ పోన్ అవడం, అన్ని ఒకేసారి పట్టాలెక్కడంతో ఒప్పుకున్నా సినిమాలకు న్యాయం చెయ్యాలనే తాపత్రయంతో అలియా భట్ షూటింగ్స్ లో పాల్గొనడం వలనే అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది.

Hospitalized RRR Beauty!:

Alia Bhatt was hospitalized due to exhaustion during the shoot

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ