Advertisement

క్షమించమంటున్న టాలెంటెడ్ నటుడు

Sat 16th Jan 2021 08:27 PM
vijay sethupathi,apologizes,cack cutting  క్షమించమంటున్న టాలెంటెడ్ నటుడు
Talented actor apologizes to netizens క్షమించమంటున్న టాలెంటెడ్ నటుడు
Advertisement

తమిళ స్టార్ హీరో కం విలన్ కం కేరెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి ఇప్పుడు ఓ వివాదం లో ఇరుక్కున్నాడు. మొన్నటికి మొన్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమిళుల ఆగ్రహానికి గురై.. ఆ బయోపిక్ కి బై బై చెప్పేసిన విజయ్ సేతుపతి మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఎందుకంటే రీసెంట్ గా విజయ్ సేతుపతి పుట్టిన రోజు నాడు విజయ్ సేతుపతి కేక్ కట్ చెయ్యడమే వివాదాలకు కారణమయ్యింది. 

తాను నటిస్తున్న సినిమా సెట్స్ లో తన టీం కేక్ తెచ్చి విజయ్ సేతుపతి తో కట్ చేయించారు. అయితే అందరూ కేక్ కటింగ్ కి చాకు ఉపయోగివస్తే విజయ్ సేతుపతి మాత్రం ఖడ్గంతో కేక్ కట్ చెయ్యడంతో ఇప్పుడు అది కాస్త వివాదం అయ్యింది. విజయ్ సేతుపతి ఖడ్గంతో కేక్ కట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో చూసి నెటిజెన్స్ విజయ్ సేతుపతి మీద విమర్శలు గుప్పించారు. రౌడీలా ఇలా కత్తితో కేక్ కట్ చెయ్యడం ఏమిటి అంటూ విజయ్ సేతుపతి మీద విరుచుకుపడడంతో విజయ్ దిగొచ్చి క్షమాపణలు చెప్పడమే కాదు.. తాను నటిస్తున్న సినిమాలో ఖడ్గం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది అని.. అందుకే మూవీ యూనిట్ అలా ఖడ్గంతో కేక్ కట్ చేయించారని.. ఇలాంటివి మరోసారి జరక్కుండా చూసుకుంటా అంటూ వివరణ ఇచ్చాడు. 

Talented actor apologizes to netizens:

Vijay Sethupathi apologizes for cutting the cake with the sword

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement