Advertisementt

కెజిఎఫ్ స్టార్ తో పూరి సినిమా?

Tue 05th Jan 2021 11:57 AM
puri yash combination movie  కెజిఎఫ్ స్టార్ తో పూరి సినిమా?
Puri movie with KGF star? కెజిఎఫ్ స్టార్ తో పూరి సినిమా?
Advertisement
Ads by CJ

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజిఎఫ్ స్టార్ గా పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకున్న హీరో యశ్.. కెజిఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలే నెలకొల్పాడు. కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు వెయిటింగ్. ప్రస్తుతం యశ్ కెజిఎఫ్ తర్వాత తన తదుపరి సినిమాపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం టాలీవడ్ టాప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని సలార్ తో లైన్ లో పెట్టేసాడు. అయితే తాజాగా కెజిఎఫ్ స్టార్ యశ్ కి టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పాన్ ఇండియా లెవెల్ కథని వినిపించాడని..  స్టోరీ లైన్ నచ్చిన యశ్ పూరి కథకు సానుకూలంగా స్పందించాడనే టాక్ వినబడుతుంది.

లాక్ డౌన్ మొదలయ్యాక ఏ దర్శకులు ఎలా ఉన్నారో, ఏం చేసారో కానీ .. పూరి మాత్రం పూరి మ్యూజింగ్స్, అలాగే ఓటిటీల కోసం కథలు రెడీ చేయడం, తన దగ్గర ఉన్న జనగణమన స్క్రిప్ట్ ని పాన్ ఇండియా లెవెల్ కి డెవెలెప్ చెయ్యడం వంటి విషయాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్ తన తదుపరి పాన్ ఇండియా ఫిలిం కోసం కెజిఎఫ్ స్టార్ యశ్ ని కలిశాడనే టాక్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి పూరి మాస్ కి యశ్ యాక్షన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న కథకి యశ్ అయితే సూట్ అవుతాడని అంటున్నారు. ఈ సినిమాకి గనక యశ్ ఒప్పుకుంటే బాక్సులు బద్దలే అంటున్నారు పూరి అభిమానులు. 

Puri movie with KGF star?:

Puri - Yash Combination on cards

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ