Advertisement

బిగ్ రూమర్: చిరు చెల్లిగా..

Sat 02nd Jan 2021 04:44 PM
nayanthara chiranjeevi lucifer remake  బిగ్ రూమర్: చిరు చెల్లిగా..
Big Rumour: Is this Chiru's sister బిగ్ రూమర్: చిరు చెల్లిగా..
Advertisement

చిరంజీవి మలయాళ లూసిఫెర్ రీమేక్ ని తమిళ రీమేక్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. ఆ విషయం అధికారిక ప్రకటన రావడమే కాదు.. ఫిబ్రవరి 11 నుండి లూసిఫెర్ రీమేక్ అధికారికంగా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. అయితే చిరంజీవివి తప్ప లూసిఫెర్ రీమేక్ లో నటించబోయే ఇతర నటుల మీద క్లారిటీ లేదు. మలయాళ లూసిఫెర్ లో మెయిన్ లీడ్ కేరెక్టర్స్ అయినా వివేక్ ఒబెరాయ్, సచిన్ ఖేడ్కర్, మంజు వారియర్ లాంటి పాత్రల్లో తెలుగు లూసిఫర్ లో ఎవరు నటిస్తారో అనేదాని మీద రోజుకో పేరు ప్రచారం లోకి వస్తుంది. వివేక్ ఒబెరాయ్ పాత్రకి నటుడు జగపతి బాబు ని ఎంపిక చేశారనే టాక్ ఉండగా.. ఇప్పుడు చిరు చెల్లెలు మంజు వారియర్ పాత్రకి మరో స్టార్ హీరోయిన్ పేరు ప్రచారం లోకి వచ్చింది.

సౌత్ లో భారీ రెమ్యునరేషన్ అందుకునే లేడి సూపర్ స్టార్ నయనతార చిరు చెల్లె పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో చేయబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సై ర నరసింహ రెడ్డి లో చిరు భార్య గా నటించిన నయనతార క్రేజ్ సౌత్ లో మాములుగా లేదు. అందుకే నయనతారను చిరు చెల్లిగా ముఖ్యమంత్రి సచిన్ ఖేడ్కర్ కూతురుగా నటింపచేయడానికి నయన్ ని సంప్రదించారనే ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో గ్లామర్ గా దూసుకుపోతున్న నయనతార ఏమిటి చిరు చెల్లెగా నటించడం అంటూ నయన్ ఫాన్స్ ఈ రూమర్ పై కామెడీ చేస్తున్నారు.

Big Rumour: Is this Chiru's sister:

Nayanthara In Chiranjeevi’s Lucifer Remake

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement