Advertisement

సునీత పెళ్లి పార్టీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

Sun 20th Dec 2020 11:14 PM
sunitha,ram,singer sunith second marriage,nithiin,pre wedding party  సునీత పెళ్లి పార్టీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
Interesting news on Sunita's pre wedding party! సునీత పెళ్లి పార్టీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
Advertisement

సింగర్ సునీత మళ్ళీ పెళ్లి ఇప్పుడు పెద్ద సెన్సేషనల్ న్యూస్. సునీత మ్యాంగో యూట్యూబ్ ఓనర్ రామ్ ని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే సునీత పెళ్లి తేదీలపై మీడియాలో రకరకాల న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఈ నెల 27 న సునీత రెండో వివాహం అని, కాదు సునీత పెళ్లి ఈ ఏడాది కాదు.. పోస్ట్ పోన్ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక సునీత కూడా ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కి వచ్చినప్పుడు నా పెళ్లి తేదీ నేనే చెబుతా.. మీరు రకరకాల డేట్స్ ఊహించుకోకండి అంటూ.. ఇది పెళ్లి అనేకన్నా రెండు కుటుంబాల కలయిక.. అంటూ సున్నితంగానే చెప్పింది. 

అయితే తాజాగా సునీత రెండో పెళ్లి చాలా సింపుల్ గానే జరగబోతుంది అని, ఈ పెళ్ళికి ఎవరికీ ఆహ్వానాలు లేవని, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన సింపుల్ గా సునీత రామ్ ని వివాహం చేసుకోబోతుందట. అయితే సునీత పెళ్లి కుదిరిన సందర్భంగా కొంతమంది సన్నిహితులతో పార్టీ చేసుకుందట. అయితే ఈ పార్టీకి హీరో నితిన్ హోస్ట్ చెయ్యడం ఇక్కడ షాకిచ్చే విషయం. సునీత పెళ్లి పార్టీకి నితిన్ హోస్ట్ చెయ్యడం వెనుక.. రామ్ ఉన్నాడట. అంటే మ్యాంగో రామ్ కి నితిన్ కి ఉన్న సన్నిహిత సంబంధాల వలనే నితిన్ ఈ పార్టీకి హోస్ట్ గా వ్యవహరించినట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక ఈ పార్టీ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్ లో జరిగినట్టుగా సమాచారం.

Interesting news on Sunita's pre wedding party!:

Nithiin Hosts in Singer Sunitha - ram Pre Wedding Party

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement