ఒకప్పుడు కామెడీ షో.. ఇప్పుడంతా రొమాన్సే!
Jabardasth comedy show turns Romance Showఏడెనిమిదేళ్ళుగా ఈటీవీలో జబర్దస్త్ కామెడీకి కామెడీ ప్రియులు ఎడిక్ట్ అయిపోయారు. గురువారం, శుక్రవారం రాత్రి 9.30 అయితే చాలు.. ఈటీవీ ఛానెల్‌కి మారిపోతారు. జబర్దస్త్ కామెడీ అంతగా హైలెట్ అయ్యింది. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్స్ కూడా డబ్బుకి డబ్బు, క్రేజ్ కి క్రేజ్ తో వెలిగిపోతున్నారు. జబర్దస్త్‌లో అబ్బాయిలే అమ్మాయిల గెటప్స్‌తో కామెడీ పండిస్తారు. కానీ హైపర్ అది, రాకింగ్ రాకేష్ లాంటి వాళ్లకు మాత్రం యాంకర్స్, టీవీ సీరియల్స్ యాక్ట్రెస్‌తో స్టేజ్ మీద కామెడీ చేయిస్తుంటారు. ఒకప్పుడు హైపర్ అది స్కిట్‌లో అనసూయ అదిరిపోయే డాన్స్ స్టెప్స్ ఉండేవి. అలాగే ఆదితో అనసూయ రొమాంటిక్‌గా రెచ్చిపోతే.. ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో అదరగొట్టేసేవాడు.
ఇక తాజాగా ఆది స్కిట్స్ లో అమ్మాయిల సంగతి ఎలా ఉన్నా.. ఇమ్మాన్యుయేల్ - సీరియల్ ఆర్టిస్ట్ వర్ష ల మధ్య రొమాన్స్ మాములుగా లేదు. కామెడీ కన్నా రొమాన్స్ ఎక్కువగా హైలెట్ అవుతుంది. ఇప్పటికే కెవ్వు కార్తీక్ స్కిట్ లో వర్ష నడుమందాలు సోషల్ మీడియాని తాకాయి. లేడి గెటప్స్ చూసి చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఫ్రెష్ అమ్మాయి వర్ష కామెడీ, ఇమ్మాన్యుయేల్‌తో ఆమె నడిపే రొమాన్స్ కొత్తగా ఉన్నాయంటున్నారు. వర్ష గ్లామర్‌ని తట్టుకోవాలంటే అనసూయ కూడా గ్లామర్ డోస్ పెంచాలని డిసైడ్ అవ్వబట్టే.. ఈమధ్యన అందాలు ఆరబోయడం ఎక్కువైంది అని అంటున్నారు. సో జబర్దస్త్‌లో కామెడీ పక్క దారి పట్టి గ్లామర్ షోతో పాటుగా రొమాన్స్ ని బాగా హైలెట్ చేస్తున్నారనే కామెంట్స్ పడుతున్నాయి.
New Love story starts in Jabardasth Comedy show







































