ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Crazy rumor turning around huge Project

భారీ ప్రాజెక్ట్ పై మరో క్రేజీ రూమర్.!

వెంకటేష్ - వరుణ్ తేజ్ కోబ్రాలుగా నటించిన ఎఫ్ 2 కామెడీ బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్ చెయ్యడానికి దర్శకనిర్మాతలైన అనిల్ రావిపూడి - దిల్ రాజులు సిద్ధమైపోయారు. ఎఫ్ 3 ఇంకా మొదలు కాకుండానే అనిల్ రావిపూడి సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ ని వదిలింది ఎఫ్ 3 టీం. అందులో వెంకటేష్ - వరుణ్ తేజ్ లు మనీ ట్రాలీ తో నవ్వులు పూయించడానికి రెడీ అయ్యారు. అయితే ఈసారి ఎఫ్ 3 మొత్తం డబ్బు చుట్టూ నే తిరుగుతుందని ఆ కాన్సెప్ట్ పోస్టర్ తోనే అర్ధమైపోయింది. మరి ఎఫ్ 3 లో వెంకీ - వరుణ్ లతో పాటుగా మరో హీరో ఉంటాడని ఆ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడనే న్యూస్ ఉంది.

అసలు మూడో హీరో గురించి అనిల్ రావిపూడి ఎక్కడా చెప్పకుండా హైప్ క్రియేట్ చేస్తున్నాడా? అసలు ఎఫ్ 3 లో మూడు హీరోకి ప్లేస్ ఉందా? లేదా? సోషల్ మీడియా ప్రచారం ప్రకారం రవితేజ - వెంకీ - వరుణ్ ల ఎఫ్ 3 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మాములుగా ఉండదని ప్రచారం జరుగుతుంది. తాజాగా రవితేజ కాదు.. యాక్షన్ హీరో గోపీచంద్ ఎఫ్ 3  లో మరో హీరో గా నటించబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి గోపీచంద్ ని సంప్రదించాడని.. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న గోపీచంద్ కూడా ఈ ప్రపోజల్ ని మారుమాట్లాడకుండా ఒప్పేసుకున్నాడనే టాక్ న్యూస్ నడుస్తుంది. మరి ఎఫ్ 3 లో అసలు మరో హీరో ఉంటాడా? ఉంటే అది రవితేజానా లేదంటే గోపీచందా అనేది అనిల్ రావిపూడి స్పందిస్తేనే కానీ తెలియదు.

Gopichand Part Of F3?

Crazy rumor turning around huge Project
f3 movie
anil ravipudi
venkatesh
varun tej
raviteja
gopichand