ఢీ షోలో లాస్య - రవి జంట బాగా పాపులయ్యింది. లాస్య కి రవికి విభేదాలు రావడంతో.. సుధీర్ - రష్మిలు ఢీ షో యాంకర్స్ గా వచ్చారు. వారిది బుల్లితెర హిట్ పెయిర్ కాబట్టి వారి జంట ఢీ స్టేజ్ మీద బాగా పాపులర్ అయ్యింది. మరి ఢీ షో ఎప్పటినుండో ఈ టివిలో ప్రసారమవుతున్న భారీ డాన్స్ షో. అందుకే యాజమాన్యం కూడా కొత్త కొత్త గా ఆలోచనలు చేస్తుంది. ఇక సుధీర్ - రష్మీ మెంటర్స్ గా మారాక ప్రదీప్ యాంకరింగ్ చేసాడు. సుధీర్ - రష్మీ జంటగా మారాక మరో జంటగా అది అండ్ వర్షిణిలు ఢీ స్టేజ్ మీద కామెడీ చేస్తున్నారు. ప్రదీప్ భారీ పంచ్ లకి వర్షిణి అమాయకపు చూపులు, మాటలు, ఆమె గ్లామర్, ఆది సెటైర్స్, సుధీర్ అమాయమకపు ఫేస్, రష్మీ గౌతమ్ అందాలు అన్ని ఢీ డాన్స్ షోకి అదనపు ఆకర్షణలు.
వర్షిణి - ఆది జంటగా డాన్స్ పెరఫార్మెన్స్ చెయ్యడం, రొమాన్స్ పండించడం, కత్తిలాంటి నడుము అందాలతో ఢీ డాన్స్ స్టేజ్ ని ఊపేసేది. అందానికి అందం, అమాయకపు కామెడీ అన్ని వర్షిణి రష్మీ తో పోటీ పడేలా చేసాయి. ఇక ఆదితో వర్షిణి స్టేజ్ రొమాన్స్ చూసిన వారు.. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం చేసారు. ఢీ షో ద్వారా బాగా పాపులర్ అయినా వర్షిణిని ఇప్పుడు ఢీ క్వీన్స్ - కింగ్స్ నుండి తప్పించినట్లుగా తెలుస్తుంది. ఢీ షో తాజా సీజన్ ముగియడంతో.. కొత్తగా ఢీ క్వీన్స్ - కింగ్స్ సీజన్ మొదలు కాబోతుంది. అందులో ఎప్పటిలాగే సుధీర్ - రష్మీ లు కూడా ఎవరికీ వారే ఉంటారు. కానీ ఆది పక్కన వర్షిణి లేకుండా మరో యాంకర్ కనబడుతుంది. దీపిక పిల్లై అనే టిక్ టాక్ బ్యూటీని ఢీలో వర్షిణి ప్లేస్ లోకి యాంకర్‌గా తీసుకుంది ఢీ యాజమాన్యం. దానితో వర్షిణి ఢీ యాజమాన్యం తప్పించారనే టాక్ మొదలైంది.