Advertisementt

బిగ్ బాస్ 4: మోనాల్ ని మోసం చేసారు!!

Fri 20th Nov 2020 12:13 PM
monal gajjar,bigg boss,emotional,parents  బిగ్ బాస్ 4: మోనాల్ ని మోసం చేసారు!!
Bigg boss 4: Monal gets cheated బిగ్ బాస్ 4: మోనాల్ ని మోసం చేసారు!!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. నిన్న బుధవారం ఎపిసోడ్ లో హారిక, అభిజిత్, అఖిల్, అవినాష్ మథర్స్ బిగ్ బాస్ హౌస్ లో కొడుకులను చూడడానికి వచ్చి హౌస్ మేట్స్ అందరికి బాగా దగ్గరయ్యారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మొత్తం తమ బిడ్డలే అని చెప్పి అందరికి కళ్ళల్లో నీరు తెప్పించారు. హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో లాస్య భర్త మంజునాధ్, కొడుకు జున్ను హౌస్ లోకి రాగా.. అరియనా ఫ్రెండ్ కూడా వచ్చి అరియానాతో కబుర్లు చెప్పాడు. ఇక సోహైల్ తండ్రి బిగ్ బాస్ హౌస్ కి వచ్చాడు. అఖిల్ తో క్లోజ్ గా ఉంటూ... నిన్నటినుండి ఎవరి పేరేంట్స్ వచ్చినా కన్నీరు పెట్టుకుని ఎమోషనల్ అయిన మోనాల్ అటు బిగ్ బాస్ ఇటు ఆమె పేరెంట్స్ ఇద్దరూ మోసం చేసారు. 

మోసం అంటే మోనాల్ గుజరాతీ అమ్మాయి. ఆమె పేరెంట్స్ గుజరాత్ లోనే ఉంటారు. కనుక ఆమె తల్లి తండ్రులకి ఇక్కడ హైదరాబాద్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కూతురుని చూడడానికి రాలేకపోయారు. ఓ ఆడియో ద్వారా మోనాల్ కి సందేశాన్ని పంపారు. మోనాల్ బేటా ఎలా ఉన్నావ్.. నిన్ను చూడడానికి హైదరాబాద్ రాలేకపోయాం.. కుదరలేదు అనేసరికి మోనాల్ ఫుల్ గా ఏడ్చేసింది. పాపం అందరికి పేరెంట్స్ వచ్చారు.. కానీ మోనాల్ కి రాకపోయేసరికి బాగా ఎమోషనల్ అయ్యింది. మైక్ తీసి బాత్ రూమ్ కి వెళ్లి మరీ గట్టి గట్టిగా ఏడ్చేసింది. అఖిల్, సోహైల్ ఎంతగా ఓదార్చినా మోనాల్ ఏడుపు ఆపలేదు. మూడు నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్న హౌస్ మేట్స్ కి ఇలా కుటుంబ సభ్యులు కలవడం కాస్త ఓదార్పే. మోనాల్ పాపం. మోనాల్ ని అలా చూస్తే నిజంగా బాధేస్తుంది కదా అంటున్నారు నెటిజెన్స్.

Bigg boss 4: Monal gets cheated:

 Bigg boss: Monal Gajjar emotional about Parents

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ