ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Alia Bhatt Creating Problems to RRR Team

RRR కి అలియా కష్టాలు!!

రాజమౌళి RRR సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైంది. ఈపాటికి కొలిక్కి రావాల్సిన RRR షూటింగ్ కరోనా కారణంగా వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబో సీన్స్ తో రాజమౌళి షూటింగ్ ని మొదలు పెట్టినప్పటినుండి.. RRR మేకింగ్ గ్లిమ్బ్స్ అంటూ టీం హడావిడి చేస్తుంది. మరి రాజమౌళి ఎంత కష్టపడి అయినా అనుకున్నది తెరకెక్కించేవరకు నిద్రపోడు. ఇక ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతున్న RRR కి అలియా కష్టాలంటున్నారు. రామ్ చరణ్ పాత్రకి హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకున్న రాజమౌలికి ఇప్పుడు కరోనా వలన అలియా భట్ డేట్స్ విషయంలో చాలా తికమకలు జరుగుతున్నాయి.

సీత పాత్రదారి అలియా భట్ ఈ నవంబర్ సెకండ్ వీక్ నుండి RRR షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇప్పుడు అలియా రాక ఆలస్యం అంటూ ఫిలింనగర్ లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే అలియా భట్ RRR లోనే కాదు.. బాలీవుడ్ లోను భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తుంది. ఇప్పుడు అందులో సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్న గంగూభాయ్ కథియావాడి షూటింగ్ విషయమై ముంబై లోనే ఇరుక్కుపోయిందట. అసలైతే నవంబర్ మొదటి వారంలోనే అలియా భట్ గంగూభాయ్ కథియావాడి షూటింగ్ పూర్తి చెయ్యాల్సి ఉండగా... ఇప్పుడు ఆ షూటింగ్ మరో రెండు వారలు పెరిగిందట. కొన్ని సీన్స్ రీ షూట్ చెయ్యాలని సంజయ్ లీల బన్సాలి చెప్పడంతో.. అలియా భట్ ఆ షూటింగ్ కోసం RRR షూటింగ్ ని పక్కనపెట్టాల్సి వచ్చిందట.

మరి ఆ సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు అలియా భట్ RRR షూటింగ్ కోసం మరో రెండు వారాల పాటు రాలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే RRR షూటింగ్ ని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అలియా రాక ఆలస్యం కావడంతో రాజమౌళి తన షూటింగ్ షడ్యూల్ మార్చుకుని.. మిగతా అంటే అలియా లేని సీన్స్ ని ఫినిష్ చెయ్యాలని చూస్తున్నాడట.  

Alia Bhatt Delaying RRR Shoot

Alia Bhatt Creating Problems to RRR Team
alia bhatt
problems
rrr movie
mumbai
sanjay leela bhansali