Advertisement

రేటింగ్‌ విషయంలో నాగ్‌ హ్యాపీగా లేడా?

Sun 25th Oct 2020 09:58 PM
nagarjuna,bigg boss 4,unhappy,rating,weekend  రేటింగ్‌ విషయంలో నాగ్‌ హ్యాపీగా లేడా?
Nag unhappy with Bigg Boss ratings రేటింగ్‌ విషయంలో నాగ్‌ హ్యాపీగా లేడా?
Advertisement

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది మొదలు ఈ సీజన్‌పై ఎవరిలో ఉత్సాహం లేదు. ఏదో శని ఆది వారాలు నాగ్ ఎపిసోడ్స్ తప్ప చూడడానికి బిగ్ బాస్ మరేమీ లేదు. సోహైల్ కేకలు, మెహబూబ్ ఓవరాక్షన్, అఖిల్ - మోనాల్ లవ్ స్టోరీ, హగ్గులు, అమ్మ రాజశేఖర్ ఓవర్ కామెడీ, అభిజిత్ టాస్క్ పెరఫార్మెన్స్ వీక్, హారిక గోల, లాస్య అతి మంచి తనం, దివి అమ్మ అమ్మ అంటూ మాస్టర్ చుట్టూ తిరగడం, అరియనా హైలెట్ అవడానికి నానా తంటాలు పడడం, ఇక అవినాష్ కామెడీతో ఏదో అలా అలా బిగ్ బాస్ రన్ అవుతుంది. ఇక వారం వారం నాగార్జున క్లాస్ కూడా జనాలకు బోర్ కొట్టేసినట్లే కనబడుతుంది. కంటెస్టెంట్స్ అందరిని లైన్‌లో అంటే స్కూల్ పిల్లల్లా నిలబెట్టి క్లాస్ ఇవ్వడం రొటీన్‌గా మారిపోయింది.

అయితే తాజాగా బిగ్ బాస్ 4 రేటింగ్ చాలా పూర్‌గా ఉందని.. ఓపెనింగ్ ఎపిసోడ్ ఎన్టీఆర్ సీజన్ వన్, నాని సీజన్ 2, నాగ్ సీజన్ 4 ని బీట్ చేసి 18.05 రేటింగ్ వస్తే.. వీక్‌డేస్‌లో చాలా వీక్‌గా  8.35 మాత్రమే వస్తుంది. ఇక తాజాగా నాగార్జున వచ్చే శని, ఆదివారాలు ఎపిసోడ్స్‌కి ఎంత మసాలా జోడించిన 11.00 టిఆర్పి రేటింగ్‌కి మించడం లేదు. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని గొంతు చించి మొత్తుకున్నా.. సీజన్ 4 లో పస లేకపోవడం మైనస్‌గా మారింది. 

మరి ఎన్టీఆర్, నానిలని మించి హోస్టింగ్‌లో దూసుకుపోయిన నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్‌కి వస్తున్న రేటింగ్‌తో అసంతృప్తితో ఉన్నాడని అంటున్నారు. ఇక వైల్డ్ డాగ్ కోసం నాగార్జున వేరే రాష్ట్రానికి షూటింగ్ కోసం వెళ్లగా ఈ వారం నాగ్ ప్లేస్ లోకి కొత్త హోస్ట్ రావొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో రేజ్ అయ్యాయి.

Nag unhappy with Bigg Boss ratings:

Poor ratings to Bigg Boss season 4

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement