‘ఎఫ్ 3’కి ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్ ఇదే!

Fri 23rd Oct 2020 10:45 PM
f 3 movie,suresh babu,anil ravipudi,share,problem to f3 movie  ‘ఎఫ్ 3’కి ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్ ఇదే!
This is the Problem to Anil Ravipudi F 3 movie ‘ఎఫ్ 3’కి ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్ ఇదే!
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి కామెడీకి మెచ్చి దిల్ రాజు ఎక్కువగా అనిల్ రావిపూడిని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. అనిల్ రావిపూడి మీద అపార నమ్మకం పెట్టుకున్న దిల్ రాజుకి ఎఫ్ 2తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు కోట్లకి కోట్లు ఈ సినిమాతో మూట గట్టుకున్నాడు. అందుకే అనిల్ రావిపూడిని వదలడం ఇష్టంలేని దిల్ రాజు మళ్లీ ఎఫ్ 3ని ఎనౌన్స్ చేశాడు. ముందు ఎఫ్ 2ని బాలీవుడ్‌లో రీమేక్ చేద్దామనుకున్నారు కూడా. అయితే ఎఫ్3 అనౌన్స్ చేశాక దిల్ రాజు వేరే హీరోలతోనూ, అనిల్ రావిపూడి మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సినిమాలు చేసేశారు. ఇక తర్వాత ఎఫ్ 3 స్క్రిప్ట్ మీద అనిల్ రావిపూడి కూర్చున్నాడు.

ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కాల్సిన ఎఫ్ 3కి కరోనా ఆటంకం కలిగించింది. ఇక వెంకటేష్ - వరుణ్‌లు కూడా వేరే వేరే డైరెక్టర్స్‌తో సినిమాలు కమిట్ అయ్యారు. ఎఫ్ 3 కోసం వరుణ్ తేజ్ వచ్చినా వెంకటేష్ మాత్రం కదిలేలా కనిపించడం లేదు. కారణం ఆయన అన్న సురేష్ బాబు ఎఫ్ 3లో వాటా అడగడమే అనే టాక్ వినిపిస్తుంది. మరో పక్క అనిల్ రావిపూడి కూడా దిల్ రాజుతో బేరం మొదలెట్టాడని.. అనిల్ రావిపూడి షేర్ ఇవ్వడానికి దిల్ రాజు రెడీ అయ్యాడు కానీ... సురేష్ బాబుతో మాత్రం డీల్ సెట్ కాకపోవడం వలనే వెంకీ ఎఫ్ 3 విషయంలో వెనకడుగు వేస్తున్నట్టుగా టాక్. మరి ఒకే సినిమాలో మూడు వాటాలకి దిల్ రాజు ఒప్పుకుంటాడో లేదో అనేది ఇప్పుడు సస్పెన్స్. అయినా వెంకీ లేకపోతే ఎఫ్ 3 చేసినా వేస్ట్.. అంటే సురేష్ బాబు డీల్‌కి దిల్ రాజు ఒప్పుకోవాల్సిందే.

This is the Problem to Anil Ravipudi F 3 movie:

F3 Movie: Suresh Babu and Anil Ravipudi wants share

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ