Advertisement
TDP Ads

ఎన్టీఆర్ అభిమానికి కేజీఎఫ్ డైరెక్టర్ రిప్లై.. భలే ఇచ్చాడే..!

Fri 09th Oct 2020 09:15 PM
ntr,twitter,kgf,prashant neel,yash,  ఎన్టీఆర్ అభిమానికి కేజీఎఫ్ డైరెక్టర్ రిప్లై.. భలే ఇచ్చాడే..!
KGF director funny reply to NTR fan.. ఎన్టీఆర్ అభిమానికి కేజీఎఫ్ డైరెక్టర్ రిప్లై.. భలే ఇచ్చాడే..!
Advertisement

బాహుబలి తర్వాత వచ్చిన పాన్ ఇండియా చిత్రాలన్నింటిలోకి బాక్సాఫీసు వద్ద తనదైన ప్రభావాన్ని చూపించిన సినిమా ఏదంటే కేజీఎఫ్ అనే చెప్పాలి. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి రిలీజైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా సూపర్ సక్సెస్ అందుకుంది. ఒక్కసారిగా ఈ సినిమా హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి స్టార్ స్టేటస్ వచ్చేసింది. దాంతో తెలుగు నిర్మాతలందరూ ప్రశాంత్ నీల్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యారు.

ఐతే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని అందరికీ తెలిసిందే. ఈ విషయమై అధికారిక సమాచారం బయటకి రానప్పటికీ సోషల్ మీడియాలో జరిగిన చర్చల ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఐతే ఎన్టీఆర్ తో సినిమా అన్నప్పటి నుండి ప్రశాంత్ నీల్ కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ 2 సినిమా గురించి అప్డేట్ ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక రిప్లై ఇస్తుంటారు.

తాజాగా ప్రశాంత్ నీల్ ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టాడు. కేజీఎఫ్ 2 కోసం హైదరాబాద్ రావాల్సి ఉందని దాని సమాచారం. దానికి రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్ అభిమాని వచ్చాక నాకు ఒకసారి కాల్ చెయ్.. ఇద్దరం వెళ్ళి తారక్ అన్నకి కథ చెప్పి వద్దాం అని పెట్టాడు. ఇలాంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. చాలా మంది వీటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం నీ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయావంటూ మెసేజ్ పెట్టి ఆ అభిమానికి షాకిచ్చాడు. మొత్తానికి కేజీఎఫ్ డైరెక్టర్ మంచి చమత్కారే..

KGF director funny reply to NTR fan..:

KGF director funny reply to NTR fan..

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement