Advertisement

సమంతలా కాజల్ నెట్టుకురాగలదా?

Sat 10th Oct 2020 01:19 AM
kajal agarwal,samantha,marriage,movie offer,after marriage  సమంతలా కాజల్ నెట్టుకురాగలదా?
Kajal Aggarwal confirms marriage with Gautam Kitchlu సమంతలా కాజల్ నెట్టుకురాగలదా?
Advertisement

సమంత కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగ చైతన్యతో ప్రేమాయణం నడపడం.. పెళ్లితో వారిద్దరూ ఒక్కటవ్వడం జరిగిపోయింది. పెళ్లిని గోవాలో చేసుకున్న ఈ జంట సినిమా ఇండస్ట్రీకి, అభిమానులకు కలిపి గ్రాండ్‌గా రిసెప్షన్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత తన పాత్రకి ప్రత్యేకత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ కెరీర్‌ని సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తుంది. పెళ్లి దగ్గర నుండి ఇప్పటి వరకు సమంత ఖాళీగా ఉన్న టైం లేదంటే నమ్మాలి. పెళ్లి కెరీర్‌కి అడ్డుకాదని నిరూపించిన తార సమంత. ఇప్పటికీ సమంత సై అంటే అవకాశాలు పోలోమనేలా ఉంటే.. సమంత మాత్రం ఆచి తూచి అవకాశాలు వాడుతుంది.

అయితే ఇప్పుడు మరో సీనియర్ భామ కాజల్ కూడా పెళ్లి పీటలెక్కుతుంది. అనుకోకుండా అందరికి షాకిచ్చిన కాజల్ ఈ నెలాఖరున వివాహం చేసుకోబోతుంది. బిజినెస్ మ్యాన్ గౌతమ్‌ని పెళ్లాడనున్న కాజల్ పెళ్లి తర్వాత కూడా నటిస్తానని తెగేసి చెప్పేసింది. 

ఇప్పటి వరకు సీనియర్ హీరోల నుండి అవకాశాలు దండిగా దండుకుంటున్న కాజల్.. పెళ్లి తర్వాత అంతే స్పీడు కంటిన్యూ చేయగలదా? సమంత లా కెరీర్ ని మలుచుకోగలదా? సమంత అటు ఫ్యామిలీకి ఇటు కెరీర్ కి కావాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నట్టుగా కాజల్ కూడా తన కెరీర్ ని మలుచుకోగలదా? ఇప్పుడు అభిమానులే కాదు అందరిముందు ఉన్న పెద్ద ప్రశ్న ఇదే.

Kajal Aggarwal confirms marriage with Gautam Kitchlu:

Kajal Agarwal follows Samantha

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement