Advertisementt

నాకు అలాంటి పాత్రలే ఇష్టం.. మాధవన్.

Fri 02nd Oct 2020 11:06 PM
madhavan,nissabdam,anushka shetty,hemanth madhukar,kona venkat  నాకు అలాంటి పాత్రలే ఇష్టం.. మాధవన్.
I like to do that roles.. Says Madhavan నాకు అలాంటి పాత్రలే ఇష్టం.. మాధవన్.
Advertisement
Ads by CJ

తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగిన మాధవన్, ప్రస్తుతం విలన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలో మాధవన్ విలన్ గా మెప్పించాడు. ఐతే తాజాగా మాధవన్ నటించిన నిశ్శబ్దం చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది.

ఐతే ఈ సినిమాలో మాధవన్ పాత్రపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఆ పాత్రలో మాధవన్ చాలా చక్కగా చేసాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాధవన్, తన పాత్రపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నిశ్శబ్దం సినిమాలో ఒకానొక ట్విస్ట్ కి కారణమైన ఈ పాత్రని చేస్తున్నప్పుడు మీరెలా ఫీలయ్యారని అడిగితే ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

నాకు నెగెటివ్ రోల్స్ వేయడమంటే చాలా ఇష్టం. థ్రిల్లర్ కథాంశల్లో ఉండే ట్విస్టులు బాగుంటాయి. అందుకే ఇలాంటి పాత్రల్లో కనిపించడానికి ఇష్టపడతానని తెలిపాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం సినిమాలో అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో కనిపించారు.

I like to do that roles.. Says Madhavan:

I like to do that roles.. Says Madhavan

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ