Advertisementt

‘బీబీ 3’.. డిజిటల్‌ రైట్స్‌కు భారీ ఆఫర్‌..!

Fri 25th Sep 2020 06:34 PM
balakrishna,boyapati,bb 3 movie,digital rights,amazon prime  ‘బీబీ 3’.. డిజిటల్‌ రైట్స్‌కు భారీ ఆఫర్‌..!
Superb Offer to BB 3 Digital Rights ‘బీబీ 3’.. డిజిటల్‌ రైట్స్‌కు భారీ ఆఫర్‌..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో దెబ్బతిని.. రూలర్ సినిమాతో ప్లాప్ కొట్టాక బోయపాటితో సినిమా మొదలు పెట్టాడు బాలయ్య. బోయపాటి - బాలయ్య కాంబో అంటే బొమ్మ దద్దరిల్లాల్సిందే. లెజెండ్, సింహ అంత మాస్ హిట్స్, అందుకే వారి కాంబోలో తయారవుతున్న BB3 పై భీభత్సమైన అంచనాలున్నాయి. అందులోను బోయపాటి బాలయ్య బర్త్ డేకి కట్ చేసిన BB3 టీజర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. అయితే కరోనా ముందు కొద్దిమేర షూటింగ్ చేసుకున్న BB3 ఇప్పుడు కరోనా తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి బోయపాటి - బాలయ్య రెడీ అవుతున్నారు. దానికి సంబందించిన ఏర్పాట్లు రామోజీ ఫిలింసిటీలో ఎప్పుడో మొదలయ్యాయి.

షూటింగ్ మొదలు పెట్టడం ఆలస్యం.. షూటింగ్ మొత్తం సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని బోయపాటి చూస్తున్నాడట. దానికి సంబందించిన ప్లాన్స్ అన్ని నటినటులతో చర్చిస్తున్నాడట. ఇక షూటింగ్ మొత్తం అనుకున్నట్టుగా ఫాస్ట్ గా అయిపోతే... బాలయ్య - బోయపాటి సినిమాని సంక్రాంతి బరిలో నిలపడం పక్కా అంటున్నారు. అయితే బాలయ్య - బోయపాటి కాంబోపై ఉన్న క్రేజ్ తో... కరోనా కారణంగా ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ BB3 డిజిటల్ హక్కులను దక్కించుకోవడానికి రెడీ అయినట్లుగా టాక్. 

దాని కోసం BB3 కి 9 నుండి 10 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా డీల్ ఓకే అయితే.. బాలయ్య కెరీర్ లో అతిపెద్ద డిజిటల్ డీల్ ఇదే అవుతుంది. మరి ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాని బాలయ్య - బోయపాటి సినిమా బిజినెస్ అప్పుడే మొదలై పోయిందన్నమాట. దట్ ఈజ్ బోయపాటి - బాలయ్య కాంబో అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.

Superb Offer to BB 3 Digital Rights:

Amazon prime waiting for BB 3 Digital Rights

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ